Kanhaiya Kumar | NSUI జాతీయ ఇంచార్జీగా.. కన్హయ్య కుమార్

Kanhaiya Kumar విధాత, కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఇంచార్జీగా కన్హయ్య కుమార్‌ను నియమిస్తు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే.సి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే ఆదేశాల మేరకు ఈ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కన్హయ్య కుమార్ నియామకంతో ఎన్‌ఎస్‌యుఐ విస్తరణ దిశగా కీలక మలుపు గా భావిస్తున్నారు. కన్హయ్య కుమార్‌ ఆవేశపూరిత ప్రసంగాలకు ప్రసిద్ధి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యార్థి […]

Kanhaiya Kumar | NSUI జాతీయ ఇంచార్జీగా.. కన్హయ్య కుమార్

Kanhaiya Kumar

విధాత, కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఇంచార్జీగా కన్హయ్య కుమార్‌ను నియమిస్తు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే.సి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే ఆదేశాల మేరకు ఈ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు.

కన్హయ్య కుమార్ నియామకంతో ఎన్‌ఎస్‌యుఐ విస్తరణ దిశగా కీలక మలుపు గా భావిస్తున్నారు. కన్హయ్య కుమార్‌ ఆవేశపూరిత ప్రసంగాలకు ప్రసిద్ధి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యార్థి విభాగానికి అతడి నియామకం ప్రయోజన కరంగా ఉంటుందని కాంగ్రెస్ ఆశిస్తుంది.

కన్హయ్య కుమార్ ఎవరు?

1987లో జన్మించిన కన్హయ్య కుమార్ 2007లో పాట్నా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సెప్టెంబర్ 2015లో, అతను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (JNUSU) అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) నాయకుడిగా పనిచేశాడు.

2021లో, కుమార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నుంచి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన తర్వాత ఆయన మాట్లాడుతూ, “నేను కాంగ్రెస్‌లో చేరుతున్నాను.. ఎందుకంటే ఇది ఒక పార్టీ కాదు, ఇది ఒక ఆలోచన…ఇది దేశంలోని పురాతన, అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అన్నారు. నేను ‘ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాను…కాంగ్రెస్ లేకుండా దేశం మనుగడ సాగించదని నాకే కాదు చాలామంది అనుకుంటున్నారన్నారు.

జిగ్నేష్ మేవానీ, హార్దిక్ పటేల్‌తో సహా ఇతర యువ నాయకులతో కన్హయ్య తరచుగా అనేక రాజకీయ ర్యాలీలలో వేదికను పంచుకున్నాడు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
2016లో జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దేశద్రోహం ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.