Warangal: BJP ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం కాజీపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిరసన చేపడుతున్న నాయకులు, కార్యకర్తలను కాజీపేట పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘ‌వ‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండగ‌డుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీ పై అనేక త‌ప్పుడు కేసుల‌తో […]

Warangal: BJP ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా
  • నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం కాజీపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిరసన చేపడుతున్న నాయకులు, కార్యకర్తలను కాజీపేట పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘ‌వ‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండగ‌డుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీ పై అనేక త‌ప్పుడు కేసుల‌తో క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు.

ఎలాంటి కేసుల‌కైనా కాంగ్రెస్ పార్టీ బెద‌ర‌ద‌ని, రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో దేశంలో మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లుతుంద‌ని అన్నారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ల శ్రీనివాస్, జక్కుల రమా రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ, రజాలి చంద్రయ్య, గుర్రపు కోటేశ్వర్, బోయిని కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.