Congress | భట్టికి మాజీల సంఘీభావం ! ఓయూ కమిటీ భేటీ !!

Congress విధాత : పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో భాగంగా కేతేప‌ల్లి మండ‌లం ఉప్ప‌ల‌పాడు గ్రామంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ను సొసైటీ ఫ‌ర్ ఎర్త్ జ‌స్టీస్ క‌మిటీ సభ్యులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెస‌ర్ ఎం. వెంక‌ట‌దాసు, ప్రొఫెస‌ర్ న‌ర‌సింహ‌, ప్రొఫెస‌ర్ నాగ‌రాజు, ర‌వి కిషోర్, శ్రావ‌ణ్‌, బోయ గోపి ఆధ్వ‌ర్యంలోని 20 మంది ఉస్మానియా వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్లు, స్కాల‌ర్లు, విద్యార్థుల బృందం ప్ర‌త్యేకంగా క‌లిసింది. ఈ సంద‌ర్భంగా మూసీన‌ది కాలుష్యం, దాని ప‌ర్య‌వ‌సానాలను సీఎల్పీ నేత‌కు వివ‌రించారు. […]

Congress | భట్టికి మాజీల సంఘీభావం ! ఓయూ కమిటీ భేటీ !!

Congress

విధాత : పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో భాగంగా కేతేప‌ల్లి మండ‌లం ఉప్ప‌ల‌పాడు గ్రామంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ను సొసైటీ ఫ‌ర్ ఎర్త్ జ‌స్టీస్ క‌మిటీ సభ్యులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెస‌ర్ ఎం. వెంక‌ట‌దాసు, ప్రొఫెస‌ర్ న‌ర‌సింహ‌, ప్రొఫెస‌ర్ నాగ‌రాజు, ర‌వి కిషోర్, శ్రావ‌ణ్‌, బోయ గోపి ఆధ్వ‌ర్యంలోని 20 మంది ఉస్మానియా వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్లు, స్కాల‌ర్లు, విద్యార్థుల బృందం ప్ర‌త్యేకంగా క‌లిసింది.

ఈ సంద‌ర్భంగా మూసీన‌ది కాలుష్యం, దాని ప‌ర్య‌వ‌సానాలను సీఎల్పీ నేత‌కు వివ‌రించారు. మూసీన‌ది ప్రక్షాళ‌న‌ గురించి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేందుకు ఇప్ప‌టికే రెండు సార్లు మూసీ పరివాహ‌క ప్రాంతంలో పాద‌యాత్ర చేశామ‌ని వారు వివ‌రించారు. మూడో విడ‌త పాద‌యాత్ర‌ను త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని సీఎల్పీ నేత‌కు వారు వివ‌రించారు.

మూసీ కాలుష్య నివార‌ణ‌కోసం, ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేందుకు వారు చేస్తున్న పోరాటాన్ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అభినందించారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసీ సమస్యల అంశంపై కమిటీ సభ్యుల సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.

మాజీల సంఘీభావం

సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు తెలంగాణలోని పలు జిల్లాల మాజీ మావోయిస్టులు సంఘీభావం తెలిపారు. వారు భట్టి విక్రమార్కని కలిసి తమ సమస్యలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎదురవుతున్న వేధింపులు, పెండింగ్ లో ఉన్న పునరావాస పథకాల సమస్యలను భట్టికి ఏకరువు పెట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా వాటిని పరిష్కరించాలని కోరారు. స్పందించిన భట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, మాజీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.