Bhatti Vs KTR: వద్ధురా నాయనా.. 20శాతం పరిపాలన: అసెంబ్లీలో రచ్చ
అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ కు దారితీసింది. సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా అంశాన్ని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ ప్రస్తావించడం వివాదాస్పదమై పరస్పర సవాళ్లకు, నిరసనలకు కారణమైంది.

Bhatti Vs KTR In The Assembly:
అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ కు దారితీసింది. సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా అంశాన్ని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ ప్రస్తావించడం వివాదాస్పదమై పరస్పర సవాళ్లకు, నిరసనలకు కారణమైంది. 20శాతం కమిషన్ ఇస్తేనే కంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారంటూ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ముందు ధర్నాకు దిగారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైతే 30శాతం కమిషన్లు అంటున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని..ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనుకోవద్ధని కేటీఆర్ ను హెచ్చరించారు. పర్సంటేజీలను కేటీఆర్ నిరూపించాలని ..లేదంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్రంపై పడి అడ్డగోలుగా దోచుకున్నారని..40వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు.
దీంతో భట్టి తమ సభ్యుడు కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. భట్టి వ్యాఖ్యలను నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ మెట్ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన అంటూ నినాదాలు చేశారు. ప్రజాపాలన కాదు.. పర్సంటేజ్ ల పాలన అని.. ఉద్యోగుల బిల్లుల కోసం పర్సంటేజీలా సిగ్గు సిగ్గు అంటూ నినదించారు. మార్షల్ జోక్యంతో నిరసన విరమించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి సభలోకి వెళ్లారు.