కేరళలో కరోనా కలకలం.. 24 గంటల్లో 300 కొత్త కేసులు
కేరళలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 300 కేసులు నమోదు అయ్యాయి.ముగ్గురు మరణించినట్లు కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది

తిరువనంతపురం : కేరళలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 300 కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,669 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళకు చెందిన డాక్టర్ శ్రీజిత్ ఎన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ, దాని ప్రభావం అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా మరణాలు ఎక్కువగా లేవు అని ఆయన స్పష్టం చేవారు. జలుబు, దగ్గు వచ్చిన వారు అప్రమ్తతంగా ఉండి, టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ నిన్న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సబ్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సిద్ధం చేయాలని, నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్, వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.