Chandrayaan-3 | చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం.

Chandrayaan-3 షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి విధాత‌: చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. Chandrayaan-3 mission: The ‘Launch Rehearsal’ simulating the entire launch preparation and process lasting 24 hours […]

Chandrayaan-3 | చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం.

Chandrayaan-3

  • షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి

విధాత‌: చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ ఉన్నారు.

జాబిల్లి ర‌హ‌స్య ప్ర‌దేశం అందేనా… బ‌య‌లుదేర‌నున్న చంద్ర‌యాన్-3

మ‌రికొద్ది గంట‌ల్లోనే ఎల్ వీ ఎం-3 వాహ‌క‌నైక చంద్ర‌యాన్-3 (Chandrayan-3) తీసుకుని నింగిలోకి దూసుకెళ్ల‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 2 35 కి కౌంట్‌డౌన్ మొద‌లై 24 గంట‌ల‌పాటు కొన‌సాగనుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 35కి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రుని వ‌ద్ద‌కు త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తుంది.

శాస్త్రవేత్తలు, మాన‌సిక శాస్త్రవేత్త‌ల‌కు చంద‌మామ (Moon) ఎప్పుడూ అపురూప‌మే. శాస్త్రవేత్త‌లు అక్క‌డ మాన‌వ నివాసాల‌ను ఏర్పాటు చేయ‌డానికి అనువైన ప‌రిస్థితుల కోసం చూస్తుంటే… మ‌నుషుల ఆలోచ‌న‌ల‌పై చంద్రుడు ఏ ప్ర‌భావాన్ని చూపిస్తాడ‌నేది త‌త్వ‌వేత్త‌ల ఆలోచ‌న‌. ఈ కోణంలో ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. అయితే భార‌త్ మాత్రం చంద్రుని ద‌క్షిణార్థ గోళంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అంత గొప్పద‌నం ఏముంది అక్క‌డ.?

చంద్రుని ద‌క్షిణ ధ్రువాన్నే శాస్త్రవేత్త‌లు లూనార్ సౌత్‌పోల్ (Lunar South pole) అని వ్య‌వ‌హ‌రిస్తారు. చంద్రుడు భూమిలా త‌న చుట్టూ తాను తిర‌గ‌డు. అందుకే చంద్రునిలోని ఒక భాగం అస‌లు సూర్యునికి ఎదురుగా రాదు. అదే ద‌క్షిణార్థ గోళం.. మ‌నకు క‌నిపించే చంద్రుడు అంతా ఉత్త‌రార్థ‌గోళ‌మే. అస‌లు సూర్యుని కిర‌ణాలే తాక‌ని ప్ర‌దేశం కావ‌డంతో చంద్రుని తొలి రోజుల్లో ఎలాంటి ప‌రిస్థితి ఉందో ఇప్పుడూ అక్క‌డ అలా ఉండే అవ‌కాశ‌మే ఎక్కువ‌.

దీనిని తెలుసుకోవ‌డానికే ఇస్రో ప్ర‌య‌త్నిస్తోంది. నాసా అంచ‌నా ప్ర‌కారం.. లూనార్ సౌత్‌లో ఉన్న కొన్న ప్రాంతాల్లో సూర్య‌కిర‌ణాలు ప‌డి కొన్నిబిలియ‌న్ సంవ‌త్స‌రాలు అయి ఉంటుంద‌ని అంచ‌నా. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త – 203 డిగ్రీల సెల్సియ‌స్ పైమాటే. అందుకే ఈ ప్రాంతాలు కోల్డ్ స్టోరేజీల్లా ప‌ని చేస్తూ.. సౌర కుటుంబ తొలి రోజుల‌కు చెందిన హైడ్రోజ‌న్‌, మంచినీటి గ‌డ్డ‌లు, ఇత‌ర ఏమైనా మూల‌కాల‌ను క‌లిగి ఉండొచ్చ‌ని శాస్త్రవేత్త‌లు భావిస్తున్నారు.

గ‌తంలో ఏం జ‌రిగింది?

లూనార్ సౌత్‌ను ప‌లు దేశాలు ప‌రిశోధించాయి.. కొన్ని ప్ర‌య‌త్నించాయి. 2008లో ఇస్రో అభివృద్ధి చేసిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) చంద్ర‌యాన్ 1 నుంచి విడిపోయి ద‌క్షిణ ధ్రువం వైపు దూసుకెళ్లింది. అనంత‌రం అదే ఏడాది న‌వంబ‌రు 14న ప్ర‌ణాళిక ప్ర‌కారం.. షేకాల్ట‌న్ అనే బిలంపై ఢీ కొట్టింది. ఈ ప్రయోగంతో చంద్రుని ద‌క్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశంగా భార‌త్ నిలిచింది. అనంత‌రం 2019 జులై 22న చంద్ర‌యాన్-2 ప్ర‌యోగంతో లూనార్ సౌత్‌పై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఇస్రో య‌త్నించింది.

అయితే ప‌లు సాంకేతిక లోపాలు త‌లెత్త‌డంతో చంద్రుని ఉప‌రిత‌లంపై 335 ఎత్తులో ఉండ‌గా..ఇస్రోకు ల్యాండ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్ర‌యొగం విఫ‌ల‌మైంది. తాజా ప్ర‌యోగంలో శుక్ర‌వారం నింగిలోకి వెళ్ల‌నున్న చంద్ర‌యాన్‌-3.. ఆగ‌స్టులో చంద్రుని ఉప‌రిత‌లంపైకి చేరుకునే అవ‌కాశం ఉంది. జాబిల్లి మ‌న‌కు చూపించ‌కుండా దాచుకున్న ఆ ర‌హ‌స్య ప్ర‌దేశం ఇప్పుడైనా మ‌న‌కు అందుతుందేమో చూడాలి