CPI Narayana | అంధ్రప్రదేశ్‌లో అరాచకం.. అమిత్‌షాకు సీపీఐ నేత నారాయణ లేఖ
CPI Narayana ఎంపీ కుటుంబ సభ్యులకే రక్షణలేదు ఇక సాధారణ ప్రజల భద్రకు ఏది హామీ? అధ్వాన్నంగా తయారైన శాంతి భద్రతలు భూకుంభకోణాలు, అక్రమ లావాదేవీలు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి చట్టవ్యతిరేక లావాదేవీల నిగ్గు తేల్చాలి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎన్ నారాయణ (CPI Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ పట్నంలో ఇటీవల ఒక ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. […]

CPI Narayana
- ఎంపీ కుటుంబ సభ్యులకే రక్షణలేదు
- ఇక సాధారణ ప్రజల భద్రకు ఏది హామీ?
- అధ్వాన్నంగా తయారైన శాంతి భద్రతలు
- భూకుంభకోణాలు, అక్రమ లావాదేవీలు
- కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి
- చట్టవ్యతిరేక లావాదేవీల నిగ్గు తేల్చాలి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎన్ నారాయణ (CPI Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ పట్నంలో ఇటీవల ఒక ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో జరుగుతున్న భూకుంభకోణాలను, చీకటి ప్రపంచపు చట్టవ్యతిరేక లావాదేవీలను బయటకు తెచ్చేందుకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు.
అమిత్ షా ఇటీవల విశాఖపట్నం సభలో మాట్లాడుతూ మాఫియా దొంగలకు, జూదగాళ్లకు, భూమాఫియాకు, సంఘ వ్యతిరేక శక్తులకు విశాఖ పట్నం అడ్డాగా మారుతున్నదని చెప్పడాన్ని నారాయణ ప్రస్తావించారు. ‘మీరు ఆ మాట చెప్పిన మూడు రోజులకే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్యను, వారి కుమారుడిని వారి ఇంటి నుంచే కొందరు కిడ్నాప్ చేసుకుని పోయారు.
ఎంపీ కుటుంబ సభ్యులకే రక్షణ లేకపోతే.. ఇక సాధారణ ప్రజల సంగతి ఏంటి?’ అని ఆ లేఖలో ప్రశ్నించారు. సత్యనారాయణ ఎంపీ మాత్రమే కాదని, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడానని తెలిపారు. అత్యంత ప్రభావశీల వ్యక్తని పేర్కొన్నారు.
కాగా..సదరు కిడ్నాపర్, ఈయన కలిసి అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డారని తెలిపారు. సొంత అసిస్టెంటే ఎంపీ భార్యను, కొడుకును ఎలా కిడ్నాప్ చేయగలిగాడని ప్రశ్నించారు. ఈ దుర్మార్గ చర్య అంతుచిక్కకుండా ఉన్నదని, కానీ.. ఏదో నిగూఢం దాగి ఉన్నదని పేర్కొన్నారు.
ఎంపీ కుమారుడు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, రౌడీషీటర్ తన వ్యక్తిగత పనిలో ఉన్నాడని, మూడు రోజుల దాకా స్టేషన్‌కు రాడని చెప్పాడంటే.. పోలీసులు ఏ తీరుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే ఈ తెరవెనుక లావాదేవీలను బయటపెట్టేందుకు కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఆయన అమిత్‌షాను కోరారు.