CPM, CPI | BRSతోనే పొత్తు.. సీపీఐ, సీపీఎం భేటీలో నిర్ణయం
CPM, CPI విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRSతో కలిసి సాగాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. CPM రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం CPI, CPM పార్టీల ముఖ్య నాయకులు సమావేశమై రాష్ట్ర రాజకీయాలు.. BRSతో పొత్తు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. CPM, CPI రాష్ట్ర కార్యదర్శిలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు , రెండు పార్టీల నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల సీఎం కేసీఆర్ […]

CPM, CPI
విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRSతో కలిసి సాగాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. CPM రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం CPI, CPM పార్టీల ముఖ్య నాయకులు సమావేశమై రాష్ట్ర రాజకీయాలు.. BRSతో పొత్తు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. CPM, CPI రాష్ట్ర కార్యదర్శిలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు , రెండు పార్టీల నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలు ఈ భేటీకి హాజరయ్యారు.
ఇటీవల సీఎం కేసీఆర్ వామపక్ష నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం.. ఖమ్మం బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పిదప తమతో పొత్తుపై కేసీఆర్ ఎక్కడా స్పష్టతనివ్వక పోవడం పట్ల వామపక్ష నేతలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ప్రజా అభిప్రాయము.. తాజాగా చేపట్టిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వంటి అంశాలపై కూడా వామపక్షాల నేతలు చర్చించారు.
జాతీయ రాజకీయాల్లో వామపక్షాల వైఖరి ప్రక్కన పెడితే.. తెలంగాణలో బిజెపిని నిలువరించేందుకు, శాసనసభలో ప్రాతినిధ్యం సాధించేందుకు బిఆర్ఎస్ తోనే ఎన్నికలకు వెళ్లాలని సిపిఐ, సిపిఎం నేతలు నిర్ణయించారు. బిఆర్ఎస్ తో పొత్తు కుదరని పక్షంలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఎన్నికల్లో ఒకరు పోటీ చేసిన చోట మరొకరు పోటీ చేయకుండా మద్దతునివ్వాలని భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
బిఆర్ఎస్ తో సాగేందుకే నిర్ణయం: తమ్మినేని
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో కలిసి సాగాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉభయ కమ్యూనిస్టుల భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎక్కడా వామపక్షాలతో పొత్తు లేదన్న రీతిలో మాట్లాడలేదన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపుతో వామపక్షాలు కీలకంగా వ్యవహరించాయన్నారు. అదే స్ఫూర్తితో బిఆర్ఎస్ తో పొత్తును మునుముందు కూడా కొనసాగించాలని నిర్ణయించామన్నారు. పొత్తు కుదరని పక్షంలో సిపిఐ, సిపిఎం లు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు.