ఆన్‌లైన్‌లో క్యాబ్‌ బుక్‌ చేస్తూ రూ.2లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. అసలు ఏం జరిగిందంటే..?

Cyber Fraud | ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. సైబర్‌ నేరాలపై పోలీసులు, నిపుణులు ఎంత అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఎక్కడో ఒకచోట ఎవరూ ఒకరు కేటుగాళ్ల బారినపడుతున్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైతం సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ.2లక్షలకుపైగా మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నాసిక్‌కు వెళ్లేందుకు […]

ఆన్‌లైన్‌లో క్యాబ్‌ బుక్‌ చేస్తూ రూ.2లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. అసలు ఏం జరిగిందంటే..?

Cyber Fraud | ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. సైబర్‌ నేరాలపై పోలీసులు, నిపుణులు ఎంత అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఎక్కడో ఒకచోట ఎవరూ ఒకరు కేటుగాళ్ల బారినపడుతున్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైతం సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ.2లక్షలకుపైగా మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నాసిక్‌కు వెళ్లేందుకు ట్రావెల్‌ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తన వివరాలు ఇచ్చి టికెట్‌ బుక్‌ చేస్తుండగా సాంకేతిక లోపం కారణంగా బుకింగ్‌ ఫెయిల్‌ అయ్యింది. ఆ తర్వాత సదరు వ్యక్తి ట్రావెల్‌ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ-మెయిల్‌ను సంప్రదించాడు.

ట్రావెల్‌ ఏజెన్సీ ఏజెంట్‌ అని నమ్మబలికి..

అయితే, కొద్దిసేపటి తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తాను రజత్‌ అని, ట్రావెల్‌ కంపెనీ ఏజెంట్‌గా అని ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. బుకింగ్‌ కోసం మరోసారి వెబ్‌సైట్‌లో రూ.100 చెల్లించాలని.. ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించవచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించగా.. వెబ్‌సైట్‌లో మరోసారి సాంకేతిక సమస్య ఎదురైంది. మళ్లీ అదే సమస్య రావడంతో బాధితుడు బుకింగ్‌ చేయకుండా వదిలేశాడు. అయితే, ఎందుకో కాస్త అనుమానంగానే అనిపించినా కొద్దిసేపటి తర్వాత అతని భయం నిజమైంది. కొద్ది గంటల్లోనే అతని క్రెడిట్‌కార్డు నుంచి రూ.2లక్షలకుపైగా డెబిట్‌ అయినట్లు మెస్సేజ్‌లు వచ్చాయి. అర్ధరాత్రి తర్వవాత క్రెడిట్‌కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్‌ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్‌లు వచ్చాయి.

తేరుకునేలోపే..

ఆ తర్వాత వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి క్రెడిట్‌కార్డులను బ్లాక్‌ చేయించాడు. అతను తేరుకునే లోపే మొత్తం 2.2లక్షలు మోసపోయాడు. దీనిపై బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎలా మోసపోయాడన్న ప్రశ్న తలెత్తింది. అయితే, ఇది ఫార్మింగ్‌ సైబర్‌ దాడి అని పోలీసులు పేర్కొన్నారు. వెబ్‌సైట్‌, కంప్యూటర్‌ డీఎన్‌ఎస్‌ సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్‌ వెబ్‌సైట్‌కు మళ్లిస్తారని పోలీసులు పేర్కొన్నారు. ఫిషింగ్‌ లింక్‌పై క్లిక్‌ చేయకపోయినా వాస్తవమైన వెబ్‌సైట్‌ ద్వారా సెర్చ్‌ చేసినా వారికి తెలియకుండానే హ్యాకర్లు నకిలీ వైబ్‌సైట్ల ద్వారా పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి ఆ తర్వాత మోసానికి పాల్పడుతారని, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

ఫార్మింగ్‌ సైబర్‌ దాడి ఎంత ప్రమాదం అంటే..

అయితే, ఫార్మింగ్‌ సైబర్‌దాడులు ఫిషింగ్‌ దాడి కంటే ప్రమాదకరమని సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఫార్మింగ్‌ సైబర్‌ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. ఉదాహరణకు ఏదైనా బ్యాంక్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా నోటిఫికేషన్‌ వచ్చినా కొద్దిగా గుర్తుపట్టేందుకు అవకాశాలుంటాయని, కానీ.. ఫార్మింగ్‌లో నకిలీ వెబ్‌సైట్‌కు మళ్లించినా ఎవరూ గుర్తుపట్టలేరని, యూఆర్‌ఎల్‌ సైతం అంతా సక్రమంగానే కనిపిస్తాయని పేర్కొన్నారు. సైబర్‌ దాడులను తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలని, అనుమానాస్పద వెబ్‌సైట్లలో లింక్‌లను క్లిక్‌ చేయడం, డౌన్‌లోడ్‌ చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.