Jodhpur | బాయ్ ఫ్రెండ్ ముందే బాలిక‌పై సామూహిక లైంగిక దాడి.. ముగ్గురు అరెస్ట్

Jodhpur విధాత‌: బాయ్ ఫ్రెండ్ ముందే బాలిక‌పై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణానికి పాల్ప‌డ్డ ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అజ్మీర్‌కు చెందిన ఓ యువ‌కుడు స్థానికంగా ఉన్న ద‌ళిత బాలిక‌ను ప్రేమిస్తున్నాడు. వీరిద్ద‌రూ క‌లిసి శ‌నివారం రాత్రి జోద్‌పూర్ బ‌స్టాండ్‌కు చేరుకున్నారు. రాత్రి 10:30 కావ‌డంతో స్థానికంగా ఉన్న ఓ గెస్ట్ హౌజ్‌కు వెళ్లారు ఆ ప్రేమికులు. గ‌ది కావాల‌ని […]

Jodhpur | బాయ్ ఫ్రెండ్ ముందే బాలిక‌పై సామూహిక లైంగిక దాడి.. ముగ్గురు అరెస్ట్

Jodhpur

విధాత‌: బాయ్ ఫ్రెండ్ ముందే బాలిక‌పై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణానికి పాల్ప‌డ్డ ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అజ్మీర్‌కు చెందిన ఓ యువ‌కుడు స్థానికంగా ఉన్న ద‌ళిత బాలిక‌ను ప్రేమిస్తున్నాడు.

వీరిద్ద‌రూ క‌లిసి శ‌నివారం రాత్రి జోద్‌పూర్ బ‌స్టాండ్‌కు చేరుకున్నారు. రాత్రి 10:30 కావ‌డంతో స్థానికంగా ఉన్న ఓ గెస్ట్ హౌజ్‌కు వెళ్లారు ఆ ప్రేమికులు. గ‌ది కావాల‌ని అడ‌గ్గా.. గెస్ట్ హౌజ్ కేర్ టేక‌ర్ ఆ అమ్మాయితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు.

దీంతో ప్రేమికులిద్ద‌రూ గెస్ట్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఒంట‌రిగా ఉన్న ఆ జంట‌ను గ‌మ‌నించిన ముగ్గురు యువ‌కులు తాము ఆశ్ర‌యం క‌ల్పిస్తామ‌ని, భోజ‌నం ఏర్పాట్లు కూడా చేస్తామ‌ని చెప్పి న‌మ్మించారు. రైల్వే స్టేష‌న్‌కు తీసుకెళ్తామ‌ని చెప్పి స్థానికంగా ఉన్న హాకీ గ్రౌండ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు.

ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు బాయ్ ఫ్రెండ్‌ను బెదిరించి, బాలిక‌పై సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. బాధితురాలి బాయ్‌ప్రెండ్‌ను చిత‌క‌బాది అక్క‌డ్నుంచి పారిపోయారు. పొద్దున్నే ఆ గ్రౌండ్ కు మార్నింగ్ వాక‌ర్స్ రావ‌డంతో.. నిస్స‌హాయ స్థితిలో ఉన్న ఆ జంట‌ను గ‌మ‌నించి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. వారిద్ద‌రిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సీసీటీవీ ఫుటేజీ స‌హాయంతో దుండ‌గుల‌ను గుర్తించారు. బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డిన స‌మంద‌ర్ సింగ్‌, ధ‌రమ్‌పాల్ సింగ్, భ‌టం సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.