Dalit Man | ద‌ళితుడికి అవ‌మానం.. నాలుక‌తో చెప్పులు నాకించిన లైన్‌మెన్

Dalit Man | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివాసీపై మూత్ర విస‌ర్జ‌న చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే, మ‌రో ఘోరం వెలుగు చూసింది. ఓ ద‌ళిత వ్య‌క్తి పట్ల విద్యుత్ లైన్ మెన్ క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న చెప్పుల‌ను ద‌ళితుడి నాలుక‌తో నాకించాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే సోన‌భ‌ద్ర జిల్లాకు రాజేంద్ర అనే ద‌ళిత వ్య‌క్తి త‌న బంధువుల ఇంటికి వెళ్లాడు. బంధువుల నివాసంలో క‌రెంట్ […]

Dalit Man | ద‌ళితుడికి అవ‌మానం.. నాలుక‌తో చెప్పులు నాకించిన లైన్‌మెన్

Dalit Man |

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివాసీపై మూత్ర విస‌ర్జ‌న చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే, మ‌రో ఘోరం వెలుగు చూసింది. ఓ ద‌ళిత వ్య‌క్తి పట్ల విద్యుత్ లైన్ మెన్ క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న చెప్పుల‌ను ద‌ళితుడి నాలుక‌తో నాకించాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే సోన‌భ‌ద్ర జిల్లాకు రాజేంద్ర అనే ద‌ళిత వ్య‌క్తి త‌న బంధువుల ఇంటికి వెళ్లాడు. బంధువుల నివాసంలో క‌రెంట్ స‌మ‌స్య ఉండ‌టంతో.. రాజేంద్ర ఆ స‌మ‌స్య‌ను స‌రిచేశాడు. దీంతో ఆ గ్రామంలో ప‌లువురి ఇండ్ల‌లో క‌రెంట్ స‌మ‌స్య ఉంది.

ఇక రాజేంద్ర‌కు ఎల‌క్ట్రిషీయ‌న్ వ‌ర్క్‌లో నైపుణ్యం ఉండ‌టంతో గ్రామంలోని ప‌లువురు అత‌ని చేత విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నారు. అత‌ను చేసిన ప‌నికి గానూ కొంత డ‌బ్బు కూడా ఇచ్చారు.

అయితే ఈ విష‌యం స్థానిక లైన్‌మెన్‌కు తెలిసింది. త‌న‌ను కాద‌ని క‌రెంట్ ప‌నులు ఎందుకు చేశావ‌ని లైన్ మెన్ తేజ్ బాలి సింగ్ ప‌టేల్.. రాజేంద్ర‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా గుంజిలు తీయించాడు.

ఆ త‌ర్వాత ప‌టేల్ త‌న చెప్పుల‌ను రాజేంద్ర నాలుక‌తో నాకించాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు తేజ్ సింగ్ ప‌టేల్‌ను అరెస్టు చేశారు.