Dalit Man | ఘోరం.. ద‌ళితుడిపై మాన‌వ మ‌లంతో దాడి..

Dalit Man | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ద‌ళితులు, గిరిజ‌న వ్య‌క్తుల‌పై దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇటీవ‌లే ఓ గిరిజ‌నుడిపై మూత్ర విస‌ర్జ‌న చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. ద‌ళిత వ్య‌క్తిపై మాన‌వ మ‌లంతో దాడి చేసిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఛ‌త్త‌ర్‌పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో కొంత‌మంది కూలీలు శుక్ర‌వారం డ్రైనేజీ ప‌నులు చేశారు. స్థానికంగా ఉన్న హ్యాండ్ పంపు వ‌ద్ద బీసీ క‌మ్యూనిటీకి చెందిన రామ్‌కృపాల్ ప‌టేల్ స్నానం చేస్తున్నాడు. కూలీలు […]

Dalit Man | ఘోరం.. ద‌ళితుడిపై మాన‌వ మ‌లంతో దాడి..

Dalit Man | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ద‌ళితులు, గిరిజ‌న వ్య‌క్తుల‌పై దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇటీవ‌లే ఓ గిరిజ‌నుడిపై మూత్ర విస‌ర్జ‌న చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. ద‌ళిత వ్య‌క్తిపై మాన‌వ మ‌లంతో దాడి చేసిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఛ‌త్త‌ర్‌పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో కొంత‌మంది కూలీలు శుక్ర‌వారం డ్రైనేజీ ప‌నులు చేశారు. స్థానికంగా ఉన్న హ్యాండ్ పంపు వ‌ద్ద బీసీ క‌మ్యూనిటీకి చెందిన రామ్‌కృపాల్ ప‌టేల్ స్నానం చేస్తున్నాడు. కూలీలు కూడా చేతులను శుభ్రం చేసుకునేందుకు అక్క‌డికి వ‌చ్చారు.

ద‌ళితుడైన ద‌శ‌ర‌థ్ అహిర్వార్ చేతులు క‌డుక్కుంటుండ‌గా.. త‌న చేతికున్న గ్రీస్ ప‌టేల్‌కు అంటింది. దీంతో కోపంతో ఊగిపోయిన ప‌టేల్.. మాన‌వ మ‌లాన్ని ఓ పాత్ర‌లో తీసుకొచ్చి ద‌శ‌ర‌థ్‌పై దాడి చేశాడు. ముఖం, చేతులు, శ‌రీరంపై మాన‌వ మ‌లాన్ని అంటించాడు.

దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత వ్య‌క్తి ద‌శ‌ర‌థ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితుడు, నిందితుడి ఇద్ద‌రి వ‌య‌సు కూడా 40 ఏండ్లు ఉంటుంద‌ని పోలీసులు పేర్కొన్నారు.