DSP | దళితుడిపై మూత్రం పోసి.. ఎమ్మెల్యే బూట్లు నాకించిన DSP
DSP | ఓ దళిత వ్యక్తి పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. దళితుడిపై మూత్ర విసర్జన చేసి హింసించారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే బూట్లు నాకించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఈ ఏడాది జూన్ 30న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ 30వ తేదీన ఓ దళిత వ్యక్తి తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేసుకుంటుండగా.. కొందరు పోలీసులు అతనిపై దాడి చేసి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ […]

DSP | ఓ దళిత వ్యక్తి పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. దళితుడిపై మూత్ర విసర్జన చేసి హింసించారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే బూట్లు నాకించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఈ ఏడాది జూన్ 30న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
జూన్ 30వ తేదీన ఓ దళిత వ్యక్తి తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేసుకుంటుండగా.. కొందరు పోలీసులు అతనిపై దాడి చేసి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీణా ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే ముందే డీఎస్పీ శివకుమార్ దళితుడిపై మూత్ర విసర్జన చేశారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే బూట్లు కూడా దళితుడితో నాకించారు. ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆ పొలంలో ఎలా దిగుతావని దళితుడిని పోలీసులు బెదిరించారు. ఫోన్ లాగేసుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు నాడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
తనకు జరిగిన అవమానాన్ని భరించలేక చివరకు జులై 27న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితుడు మీడియాకు తెలిపాడు.