MLA Podem Veeraiah | సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టిన ఎమ్మెల్యే..!
MLA Podem Veeraiah విధాతః సీఎం కేసీఆర్‌పై భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలకు, శ్రీ సీతారామచంద్ర స్వామికి ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చడం లేదని ఫిర్యాదులో ఆరోపించారు. 2014లో మొదటిసారి స్వామి వారి కల్యాణానికి కేసీఆర్ వచ్చినప్పుడు రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 2022లో వరదల సమయంలో రూ.1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణాలు, కరకట్ట ఎత్తు […]

MLA Podem Veeraiah
విధాతః సీఎం కేసీఆర్‌పై భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలకు, శ్రీ సీతారామచంద్ర స్వామికి ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చడం లేదని ఫిర్యాదులో ఆరోపించారు.
2014లో మొదటిసారి స్వామి వారి కల్యాణానికి కేసీఆర్ వచ్చినప్పుడు రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 2022లో వరదల సమయంలో రూ.1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణాలు, కరకట్ట ఎత్తు పొడిగింపు చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారని చెప్పారు.
కానీ.. నేటి వరకు రూ.100 కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలను, స్వామివారిని సైతం మోసం చేశారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోవడంతో పోలీసుల సహాయాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదుపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? చూడాలి మరి.