దళితులను నిర్బంధించిన బీజేపీ నేత.. మహిళకు గర్భస్రావం
విధాత: రెక్కాడితే కానీ డొక్కాడని దళితులు వారు.. అలాంటి దళితులు ఓ బీజేపీ నాయకుడి వద్ద అప్పు చేశారు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో.. తన కాఫీ తోటలో పనికి పెట్టుకున్నాడు ఆ నాయకుడు. పని చేయించుకోవడంతో పాటు వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేసేవాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటక చిక్కమగళూరు జిల్లాకు చెందిన జగదీశ గౌడ స్థానిక బీజేపీ నాయకుడు. అతని వద్ద కొంత మంది దళితులు రూ. 9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అందులో […]

విధాత: రెక్కాడితే కానీ డొక్కాడని దళితులు వారు.. అలాంటి దళితులు ఓ బీజేపీ నాయకుడి వద్ద అప్పు చేశారు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో.. తన కాఫీ తోటలో పనికి పెట్టుకున్నాడు ఆ నాయకుడు. పని చేయించుకోవడంతో పాటు వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేసేవాడు. వివరాల్లోకి వెళితే
కర్ణాటక చిక్కమగళూరు జిల్లాకు చెందిన జగదీశ గౌడ స్థానిక బీజేపీ నాయకుడు. అతని వద్ద కొంత మంది దళితులు రూ. 9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అందులో కొందరు అప్పు చెల్లించగా, మరికొందరు చెల్లించలేదు. దీంతో అప్పు కింద వారిని రోజువారీ కూలీలుగా తన కాఫీ తోటలో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇక పని సాఫీగానే సాగుతున్నప్పటికీ.. జగదీశ గౌడ, అతని కుమారుడు తిలక్ గౌడ కలిసి వారిని కులం పేరుతో దూషించేవారు. మానసికంగా, శారీరకంగా హింసించేవారు. అంతే గాక కాఫీ తోటలోని ఓ గదిలో 16 మంది దళితులను 15 రోజుల పాటు నిర్బంధించారు.
ఈ హింసను దళితుల బంధువులు.. అక్టోబర్ 8వ తేదీన బలేహునూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, ఫిర్యాదు చేశారు. జగదీశ గౌడ ఒత్తిడి మేరకు మరుసటి రోజే వారు కేసును ఉపసంహరించుకున్నారు. అయితే కేసు పెట్టారనే కోపంతో గర్భిణి స్త్రీపై జగదీశ గౌడ విరుచుకుపడ్డాడు. ఆమెను తీవ్రంగా హింసించడంతో ఆస్పత్రి పాలైంది. గర్భస్రావం జరిగి బిడ్డను కోల్పోయింది.
దీంతో మళ్లీ జగదీశ గౌడ, తిలక్ గౌడపై కేసు నమోదవగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు కాఫీ తోటకు వెళ్లి చూడగా, ఓ 10 మంది దాకా గదిలో నిర్బంధించి ఉండగా పోలీసులు వారిని కాపాడారు. జగదీశ గౌడ, తిలక్ గౌడ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జగదీశ గౌడ బీజేపీ నాయకుడు కాదు..
దళితులను హింసించిన జగదీశ గౌడ బీజేపీ నాయకుడు కాదని చిక్కమగళూరు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ స్పష్టం చేశారు. జగదీశ పార్టీ కార్యకర్త కానే కాదు.. సభ్యత్వం కూడా తీసుకోలేదు. ఆయన కేవలం బీజేపీ మద్దతుదారుడు మాత్రమే. అందరి ఓటర్ల లాగే జగదీశ కూడా బీజేపీకి ఓటు వేస్తున్నాడని వేణుగోపాల్ పేర్కొన్నారు.