Dasharathi Award : అయాచితంకు దాశరథీ అవార్డు
Dasharathi Award విధాతః దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన అయాచితం నటేశ్వర శర్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవార్డుతో పాటు 1 లక్షా 1,116 రూపాయల నగదును, శాలువా, జ్ఞాపికను ఈ నెల 22వ తేదీన రవీంద్ర భారతిలో […]
Dasharathi Award
విధాతః దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన అయాచితం నటేశ్వర శర్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అవార్డుతో పాటు 1 లక్షా 1,116 రూపాయల నగదును, శాలువా, జ్ఞాపికను ఈ నెల 22వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే శ్రీ కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు గ్రహీత ఆయాచితంకు అందజేస్తారు. దాశరథీ అవార్డుకు ఎంపికైన ఆయాచితం నటేశ్వర శర్మకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram