Rajamouli-David Warner| రాజ‌మౌళికి మూడు చెరువుల నీళ్లు తాగించిన డేవిడ్ వార్న‌ర్..జ‌క్క‌న్న ఫ్ర‌స్ట్రేష‌న్ పీక్స్‌లోనే..!

  • By: sn    latest    Apr 13, 2024 7:15 AM IST
Rajamouli-David Warner| రాజ‌మౌళికి మూడు చెరువుల నీళ్లు తాగించిన డేవిడ్ వార్న‌ర్..జ‌క్క‌న్న ఫ్ర‌స్ట్రేష‌న్ పీక్స్‌లోనే..!

Rajamouli-David Warner| ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి మ‌ల్టీ టాలెంటెడ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌నలో ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాకుండా న‌టుడు, డ్యాన్స‌ర్ కూడా ఉన్నాడు. రీసెంట్‌గా రాజ‌మౌళి డ్యాన్స్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, అది చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. జ‌క్క‌న్న ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయ‌గ‌ల‌డా అని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు. ఇక యాడ్స్‌లోను అప్పుడ‌ప్పుడు సంద‌డి చేస్తుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆ మ‌ధ్య ఒప్పో మొబైల్ ఫోన్ ప్రమోట్ చేస్తూ చేస్తూ ఒక వీడియో చేయ‌గా, ఇందులో రాజ‌మౌళి న‌ట‌నాప‌టిమ‌ని చూసి అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో యాడ్‌లో న‌టించి వావ్ అనిపించారు.

ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో జ‌క్క‌న్న ఓ యాడ్ చేయ‌గా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాడ్ లో భాగంగా రాజమౌళి క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి ఫోన్ చేసి తనకు క్రికెట్ మ్యాచ్ టికెట్ విషయంలో తనకు డిస్కౌంట్ కావాలని అడుగుతారు. అప్పుడు వార్న‌ర్.. రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది అని చెబుతాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. “నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?“ అని అడ‌గ‌గా, దానికి వార్న‌ర్ స్పందిస్తూ.. డిస్కౌంట్ కోసం తనతో ఓ సినిమా చేయాలని వార్నర్ కండీషన్ పెడతాడు. దాంతో త‌ప్ప‌క షూటింగ్ స్టార్ట్ చేస్తాడు జ‌క్క‌న్న‌.

వార్నర్ వెరైటీ న‌ట‌న‌, అత‌ని ప్రశ్నలు, డైలాగులు, ఎమోష‌న్స్, డైలాగ్స్ కూనీ చేయ‌డం ఇవ‌న్నీ చూసి రాజ‌మౌళికి చిరాకు వ‌స్తుంది. అప్పుడు వార్న‌ర్.. త‌న న‌ట‌న‌కి ఆస్కార్ వ‌స్తుంద‌ని భావించి, ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామ‌ని అన‌గా, దాంతో రాజ‌మౌళి ఆ సినిమా ఆలోచన మానుకుని క్రెడ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటాన‌ని చెబుతాడు. దాంతో వీడియో ముగుస్తుంది. మొత్తానికి చాలా ఫ‌న్నీగా ఈ యాడ్‌ని రూపొందించారు. డేవిడ్ మామ మాత్రం తెగ నవ్వించేసాడ‌నే చెప్పాలి. గ్రౌండ్‌లోనే కాదు ఇలా త‌న న‌ట‌న‌తోను వార్న‌ర్ అప్పుడ‌ప్పుడు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇవ్వ‌డం విశేషం. కాగా, వార్న‌ర్.. హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడే సమయంలో దక్షిణాది స్టార్ హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలను ఇమిటేట్ చేస్తూ ప‌లు వీడియోలు చేసి అల‌రించిన విష‌యం తెలిసిందే.