Rahul Gandhi | జైలుకా..? పార్లమెంట్‌కా..? పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై నేడు సూరత్ కోర్టు తీర్పు
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సూరత్ సెషన్ కోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించనున్నది. పరువు నష్టం కేసులో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్లమెంట్ సెక్రటేరియట్‌పై ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఆయన సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. నేడు తుది తీర్పును వెల్లడించనున్నది. […]

Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సూరత్ సెషన్ కోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించనున్నది. పరువు నష్టం కేసులో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్లమెంట్ సెక్రటేరియట్‌పై ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఆయన సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. నేడు తుది తీర్పును వెల్లడించనున్నది. మధ్యాహ్నం వరకు తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తున్నది. కోర్టు తీర్పును బట్టి ఆయన భవితవ్యం ఆధారపడి ఉన్నది. కేసును కొట్టివేస్తే తిరిగి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడానికి మార్గం సుగమం కానున్నది.
అసలు కేసు ఇదీ..
2019లో ఎన్నికల ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మార్చి 23న సీజేఎం కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల శిక్షను విధించింది. అయితే, నిర్ణయాన్ని అమలు చేసేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎలా వచ్చింది?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దానిపై రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసు వేశారు. అయితే, రాహుల్‌పై దాదాపు పదిపైగా క్రిమినల్ పరువు నష్టం కేసులున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆయనను మందలించింది.
రాహుల్ తరఫున వాదనలు ఇవీ..
అయితే, గతంలో కోర్టులో విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్‌ఎస్ చీమా వాదనలు వినిపించారు. రాహుల్ వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికయ్యారని, తీర్పుతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవడం పెద్ద నష్టమని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగం పరువుకు నష్టం కలిగేలా లేదని, దాన్ని అలా చిత్రీకరించారని.. ప్రధానిపై బహిరంగంగ వ్యాఖ్యలు చేసినందుకే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. సందర్భాన్ని బట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, మోదీ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులను అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు ఎవరి పరువుకు భంగం కలిగేలా లేవని, కేవలం భూతద్దంలో చూపిస్తూ పూర్ణేష్ మోదీ కేసు వేశారని ఆరోపించారు. గుజరాత్ జనాభా మొత్తం ఆరుకోట్లని, దేశంలో మోదీ ఇంటిపేరుతో 13కోట్ల మంది ఉన్నారని.. అందరి పరువుకు నష్టం కలిగిందంటే ఎలా అంటూ.. లాజిక్‌ను న్యాయవాది చీమా ప్రశ్నించారు. ఈ వ్యాజ్యం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడం వల్ల వచ్చిన ఫలితం తప్ప మరొకటి కాదని ఆరోపించారు.