Mann Ki Baat | మ‌న్ కీ బాత్ విన‌లేద‌ని.. విద్యార్థుల‌కు రూ.100 జ‌రిమానా..!

Mann Ki Baat | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం గ‌త ఆదివారం 100వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ 100వ ఎపిసోడ్‌ను దేశ ప్ర‌జ‌ల‌కు వినిపించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. ఇక విద్యార్థులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా ఆయా పాఠ‌శాల‌లు చ‌ర్య‌లు తీసుకున్నాయి. అయితే ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్‌లోని ఓ పాఠ‌శాలకు చెందిన కొంత […]

Mann Ki Baat | మ‌న్ కీ బాత్ విన‌లేద‌ని.. విద్యార్థుల‌కు రూ.100 జ‌రిమానా..!

Mann Ki Baat |

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం గ‌త ఆదివారం 100వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ 100వ ఎపిసోడ్‌ను దేశ ప్ర‌జ‌ల‌కు వినిపించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. ఇక విద్యార్థులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా ఆయా పాఠ‌శాల‌లు చ‌ర్య‌లు తీసుకున్నాయి.

అయితే ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్‌లోని ఓ పాఠ‌శాలకు చెందిన కొంత మంది విద్యార్థులు మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. మ‌న్ కీ బాత్ విన‌ని విద్యార్థుల‌కు రూ. 100 జ‌రిమానా విధిస్తున్న‌ట్లు ఆ స్కూల్ యాజ‌మాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డ‌ర్స్‌ను స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో స్కూల్ యాజ‌మాన్యం షేర్ చేసింది.

ఈ ఆర్డ‌ర్స్‌పై ఉత్త‌రాఖండ్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెలువెత్తుతున్నాయి. నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఫ‌ర్ పేరెంట్స్, స్టూడెంట్స్ రైట్స్ ప్రెసిడెంట్ అరిఫ్ ఖాన్‌.. సంబంధిత స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డెహ్రాడూన్ చీఫ్ ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్‌కు లేఖ రాశారు. దీంతో విద్యార్థుల‌కు జ‌రిమానా విధించిన స్కూల్ యాజ‌మాన్యానికి ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ లేఖ రాస్తూ మూడు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఈ సంద‌ర్భంగా అరిఫ్ ఖాన్ మాట్లాడుతూ.. డెహ్రాడూన్‌లోని జీఆర్‌డీ నిరంజ‌న్‌పూర్ అకాడ‌మీ నుంచి ఈ మేసేజ్ వ‌చ్చింద‌ని తెలిపారు. మ‌న్ కీ బాత్‌కు హాజ‌రు కాని విద్యార్థులు రూ. 100 జ‌రిమానా చెల్లించాల‌ని, లేదా మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ తీసుకురావాల‌ని ఆదేశించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.