Delhi Liquor Scam | ఈడీ యాక్షన్‌కు.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్‌..! నోటీసులపై ఏమన్నదంటే..?

Delhi Liquor Scam |ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు (Delhi Liquor Scam Case)లో ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) బుధవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. కానీ ధర్నా, ముందస్తుగా ఉన్న అపాయింట్‌మెంట్ల దృష్ట్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ నిపుణుల సహా […]

Delhi Liquor Scam | ఈడీ యాక్షన్‌కు.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్‌..! నోటీసులపై ఏమన్నదంటే..?

Delhi Liquor Scam |ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు (Delhi Liquor Scam Case)లో ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) బుధవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. కానీ ధర్నా, ముందస్తుగా ఉన్న అపాయింట్‌మెంట్ల దృష్ట్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ నిపుణుల సహా తీసుకోనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 10న మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ (Jantar Mantar) వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది తమ డిమాండ్‌ అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి (Bharat Jagruthi) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10న ఒక రోజు నిరాహార దీక్షను తలపెట్టినట్లు పేర్కొన్నారు.

9న ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానన్నారు. ఇలాంటి చర్యలతో సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామని, దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకాంక్షపరులకు గుర్తుచేస్తున్నానని, ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామన్నారు.