Delhi | ఇంటర్వ్యూకు వెళ్తున్న కోడలిపై మామ దాడి.. తలకు 17 కుట్లు
Delhi | ఏ ఇల్లాలు అయిన తన భర్త( Husband ) కు చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుంటుంది. అందుకు తనకు చేతనైనా పని చేయాలనుకుంటుంది. ఆ మాదిరిగానే ఓ ఇల్లాలు కూడా తన భర్తకు ఆర్థికంగా అండగా నిలుద్దామనే ఉద్దేశంతో జాబ్( Job ) కోసం ఇంటర్వ్యూ( Interview )కు బయల్దేరింది. అంతలోనే ఆమెపై మామ ఇటుకతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఢిల్లీ( Delhi ) మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా […]
Delhi | ఏ ఇల్లాలు అయిన తన భర్త( Husband ) కు చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుంటుంది. అందుకు తనకు చేతనైనా పని చేయాలనుకుంటుంది. ఆ మాదిరిగానే ఓ ఇల్లాలు కూడా తన భర్తకు ఆర్థికంగా అండగా నిలుద్దామనే ఉద్దేశంతో జాబ్( Job ) కోసం ఇంటర్వ్యూ( Interview )కు బయల్దేరింది. అంతలోనే ఆమెపై మామ ఇటుకతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఢిల్లీ( Delhi ) మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్‌కు చెందిన కాజల్( Kajal ) (26)కు ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ వాసి ప్రవీణ్ కుమార్( Praveen Kumar )తో వివాహం జరిగింది. ప్రవీణ్ కుమార్ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఆ డబ్బు సరిపోవడం లేదు. తాను కూడా జాబ్ చేసి భర్తకు అండగా నిలవాలని కాజల్ నిర్ణయించుకుంది. దీంతో ఇంటర్వ్యూ కోసమని ఇంటి నుంచి బయల్దేరిన కోడలిపై మామ( Father in Law ) ఇటుక( Brick )తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
సమాచారం అందుకున్న భర్త హుటాహుటిన ఇంటికి చేరుకుని, భార్య కాజల్‌ను ఆస్పత్రికి తరలించాడు. ఆమె తలకు 17 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాజల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు( Police ) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram