ఢిల్లీలో యువ‌కుడి దారుణ హ‌త్య‌

విధాత : ఢిల్లీలో దారుణం జ‌రిగింది. శ‌నివారం రాత్రి ఓ యువ‌కుడిని అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. సుంద‌ర్ న‌గ‌రి ఏరియాకు చెందిన మ‌నీష్ ఫోన్‌ను ఏడాది క్రితం కాశీం, మోహ్‌సీన్ దొంగిలించారు. ఆ స‌మ‌యంలో మ‌నీష్‌పై క‌త్తితో దాడి చేశారు. మెడ‌కు, క‌డుపుకు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో మ‌నీష్ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదైంది. ఈ కేసు విచార‌ణ కోర్టులో కొన‌సాగుతోంది. కేసును […]

ఢిల్లీలో యువ‌కుడి దారుణ హ‌త్య‌

విధాత : ఢిల్లీలో దారుణం జ‌రిగింది. శ‌నివారం రాత్రి ఓ యువ‌కుడిని అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. సుంద‌ర్ న‌గ‌రి ఏరియాకు చెందిన మ‌నీష్ ఫోన్‌ను ఏడాది క్రితం కాశీం, మోహ్‌సీన్ దొంగిలించారు. ఆ స‌మ‌యంలో మ‌నీష్‌పై క‌త్తితో దాడి చేశారు. మెడ‌కు, క‌డుపుకు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో మ‌నీష్ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదైంది. ఈ కేసు విచార‌ణ కోర్టులో కొన‌సాగుతోంది.

కేసును విత్ డ్రా చేసుకోవాల‌ని, మ‌నీష్‌ను కాశీం, మోహ్‌సీన్ కుటుంబ స‌భ్యులు కోరారు. కోర్టులోనే తేల్చుకుందామ‌ని మ‌నీష్ చెప్పాడు. దీంతో శ‌నివారం రాత్రి మ‌నీష్‌ను క‌త్తుల‌తో పొడిచి చంపారు. ఈ ఘ‌ట‌న అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే అలం, బిలాల్, ఫైజాన్ క‌లిసి మ‌నీష్‌ను హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.