Devarakonda | భట్టి పాదయాత్రలో మళ్లీ కాంగ్రెస్ వర్గీయుల తన్నులాట..!
Devarakonda దేవరకొండలో భారీగా జనం హాజరు!! విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దేవరకొండకు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున కార్నర్ మీటింగ్ కు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యురాలు రంజిత్ రంజన్ యాదవ్ కార్నర్ మీటింగ్లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన కార్నర్ మీటింగ్ కు భారీగా జనం హాజరవడంతో ఆ పార్టీ నాయకత్వంలో ఉత్సాహం వెల్లివిరిసింది. అయితే ఇదే సమయంలో బాలునాయక్ వర్గీయులకు, కిషన్ […]
Devarakonda
- దేవరకొండలో భారీగా జనం హాజరు!!
విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దేవరకొండకు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున కార్నర్ మీటింగ్ కు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యురాలు రంజిత్ రంజన్ యాదవ్ కార్నర్ మీటింగ్లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన కార్నర్ మీటింగ్ కు భారీగా జనం హాజరవడంతో ఆ పార్టీ నాయకత్వంలో ఉత్సాహం వెల్లివిరిసింది. అయితే ఇదే సమయంలో బాలునాయక్ వర్గీయులకు, కిషన్ నాయక్, రవి నాయక్ వర్గీయులకు మధ్య మరోసారి తోపులాట, తన్నులాటా సాగడం కాంగ్రెస్ నాయకత్వాన్ని అసంతృప్తికి గురిచేసింది.

భట్టి పాదయాత్ర సభకు ఏఐసీసీ సెక్రెటరీ శ్రీధర్ బాబు, నల్లగొండ పార్లమెంటు సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి, మాజీ శాసనసభ్యులు కేఎల్ఆర్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తదితర కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram