కేసీఆర్ తోనే గజ్వేల్ అభివృద్ధి
గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని మాజీ మంత్రి, తన్నీరు హరీష్ రావు అన్నారు.

♦ ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు
♦ డిసెంబర్ 9 రోజునే పింఛన్ల పెంచుడు ఏమైంది?
♦ అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వమని అడిగా?
♦ ఇప్పుడు మాట మారుస్తుండ్రు♦బీజేపీ తో కొట్టాడుతుంది బీఆర్ఎస్ పార్టీనే..
♦ గజ్వేల్ కృతజ్ఞతా సభలో మాజీ మంత్రి హరీష్ రావు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భాన్ని పురస్కరించుకుని గజ్వేల్ లో కృతజ్ఞతా సభ నిర్వహించారు.
ఈ సభకు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హాజరుకాగా, హరీష్ రావు మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గాకి రోడ్లు, తాగు, సాగునీరు, పక్కా భవనాల నిర్మాణాలు పూర్తి చేయించి కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు తప్పించుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. డిసెంబర్ 9నే పెంచిన పింఛన్లు, రైతు బంధు వేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నదని.. అసలు బీజేపీ అగ్రనేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, అరవింద్ లను ఓడించింది బీ ఆర్ఎస్ నేతలేనని మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.