Dhanush | ధనుష్‌కి రెడ్ కార్డ్.. సినిమాల నుంచి బ్యాన్!
Dhanush | స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు తమిళ స్టార్ హీరో ధనుష్. కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషలలోను మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇటీవల ధనుష్ సార్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించగా, ఈ సినిమా అభిమానులకి తెగ నచ్చేసింది. తమిళ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లుగా అగ్ర నటుడిగా సత్తా చాటుతున్న ధనుష్ త్వరలో మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ధనుష్‌కి నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీ […]

Dhanush |
స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు తమిళ స్టార్ హీరో ధనుష్. కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషలలోను మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇటీవల ధనుష్ సార్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించగా, ఈ సినిమా అభిమానులకి తెగ నచ్చేసింది. తమిళ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లుగా అగ్ర నటుడిగా సత్తా చాటుతున్న ధనుష్ త్వరలో మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
అయితే ధనుష్‌కి నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీ చేస్తూ సినిమాలపై నిషేధం విధించనుందని టాక్ మొదలైంది. నిర్మాతల మండలి నిజంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మాత్రం ఇదే జరిగితే మాత్రం అతని సినిమాలపై కూడా నిషేధం విధించడం గ్యారెంటీ అని తెలుస్తోంది.
అసలు ధనుష్‌కి రెడ్ కార్డ్ ఇవ్వడం ఏంటనేద చూస్తే.. ఆయన గతంలో శ్రీ తేండ్రల్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారట. కాని ఇప్పటి వరకు ఆ సినిమా విషయంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించి తమ సినిమాని ఆలస్యం చేస్తున్నందుకు గాను నోటీసులు ఇవ్వాలని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు తమిళ నిర్మాతల మండలి ధనుష్‌పై బ్యాన్ విధించే ఆలోచన చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ధనుష్ వివరణ ఇస్తే ఏం కాదు కాని, ఆయన ఇంకా మౌనంగా ఉంటే మాత్రం బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయని టాక్.
మరో ఆసక్తికర విషయమేమంటే తమిళనాట ధనుష్ మాదిరిగానే పలు పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయకుండా ఉంటున్న హీరోలు శింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగిబాబుకు తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది.
మరి ఇది నిజమే అయితే ఏ దర్శక నిర్మాత కూడా వీరితో సినిమా ఛాన్స్ లేదు. అప్పట్లో కమెడీయన్ వడివేలు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‌తో ఏర్పడిన గొడవ వలన కొన్నేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్నాడు. మరి ఈ హీరోల పరిస్థితి ఏంటనేది రానున్న రోజులలో తేలనుంది.