జమ్మూ జైళ్ల శాఖ డీజీ హత్య.. హంతకుడి డైరీలో ఏముందంటే..?
విధాత : జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ లోహియా(57) దారుణ హత్యకు గురైన విషయం విదితమే. లోహియా ఇంట్లో గత ఆరు నెలల నుంచి పని చేస్తున్న యాసిర్ అహ్మద్(23) ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే యాసిర్‌కు సంబంధించిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. ఆ డైరీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. అతను తీవ్ర ఒత్తిడికి గురై లోహియను గొంతు కోసి చంపినట్లు నిర్ధారించారు. యాసిర్ డైరీలో ఏముందంటే..? డియర్ డెత్.. […]

విధాత : జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ లోహియా(57) దారుణ హత్యకు గురైన విషయం విదితమే. లోహియా ఇంట్లో గత ఆరు నెలల నుంచి పని చేస్తున్న యాసిర్ అహ్మద్(23) ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే యాసిర్‌కు సంబంధించిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. ఆ డైరీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. అతను తీవ్ర ఒత్తిడికి గురై లోహియను గొంతు కోసి చంపినట్లు నిర్ధారించారు.
యాసిర్ డైరీలో ఏముందంటే..?
డియర్ డెత్.. కమ్ ఇన్ టు మై లైఫ్ అని రాసి ఉంది. నాకు చెడ్డ రోజు, వారం, నెల, సంవత్సరం, జీవితం ఉన్నాయి. అందుకు క్షమాపణలు కోరుతున్నానని రాసుకొచ్చాడు. కొన్ని పేజీల్లో హిందీ పాటలు రాసుకున్నాడు. భులా దేనా ముజే(నన్ను మరిచిపో) అనే సాంగ్‌ను రాసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరికొన్ని పేజీల్లో.. నా జీవితం మీద విరక్తి కలిగింది, జీవితం అంతే అని పేర్కొన్నాడు. ఇక సెల్ ఫోన్ బ్యాటరీ సింబల్‌ను చూపిస్తూ.. మై లైఫ్ 1 పర్సెంట్ అని రాశాడు. లవ్ 0%, ఒత్తిడి 90%, బాధ 99%, ఫేక్ స్మైల్ 100% ఉన్నాయని యాసిర్ రాసినట్లు పేర్కొన్నారు.
నా జీవితంతో నాకెలాంటి సమస్యలు లేవు.. కానీ భవిష్యత్ ఏంటనే విషయంలోనే సమస్య ఉత్పన్నమవుతుందని మరో పేజీలో యాసిర్ రాశాడు. యాసిర్‌ను విచారించిన అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే లోహియా హత్యతో ఉగ్రవాదుల సంబంధాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.