Site icon vidhaatha

Director | వాడ‌స‌లు హీరోనా, అంత బ‌లుపు దేనికి అంటూ హీరోపై డైరెక్ట‌ర్ ఫైర్

Director |

యజ్ఞం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు ఏఎస్ రవికుమార్. ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న ఆయ‌న త‌ర్వాత బాల‌య్య హీరోగా సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. వీరభద్ర అనే చిత్రంతో ఈ కాంబో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించ‌లేక‌ పోయింది.

ఇక ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో పలు చిత్రాలకు స్రీన్ ప్లే, రైటర్ గా కూడా ప‌ని చేశారు. ఇవి కూడా ఆయ‌న‌కి గుర్తింపు తెచ్చిపెట్ట‌లేదు. దీంతో కొన్నాళ్లు ఇండ‌స్ట్రీకి పూర్తి దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకొని రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామి అనే టైటిల్ తో యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీని తెర‌కెక్కించాడు. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా, ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు.

రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే టీజర్ రిలీజ్ స‌మ‌యంలో మ‌న్నారా చోప్రాకి ఆయ‌న ముద్దు పెట్టడం వివాదాస్ప‌దంగా మారింది. ఈ విష‌యంలో ఆయ‌నపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు రాగా, వాట‌న్నింటిని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేశారు.

నేను మన్నారా చోప్రాను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? నేను ఆమెను ఏమైనా కసిగా ముద్దు పెట్టుకున్నానా? నా కూతురుని కూడా అలాగే ముద్దు పెట్టుకున్నాను. అయినా మన్నారాకి లేని నొప్పి, నా భార్యకు లేని నొప్పి మీకెందుకు అంటూ ధీటుగా బ‌దులిచ్చాడు. ఇక ఈ కాంట్రవ‌ర్సీ ముగియ‌క‌ముందే తాజాగా గోపిచంద‌పై దారుణ‌మైన కామెంట్స్ ఇన్‌డైరెక్ట్‌గా చేశాడు ర‌వికుమార్

నా బర్త్ డే కి వ‌చ్చిన ఆ హీరో .. నేను దగ్గినా తుమ్మినా నా ఇంటికి వ‌చ్చిన అత‌ను ఇప్పుడు న‌న్ను మ‌రిచి పోయాడు. ఇప్పుడు ఆయ‌న‌ని క‌ల‌వాలంటే ఐదారుగురిని దాటుకొని పోవాలి. అస‌లు వాడు ఒక హీరోనా, విల‌న్‌గా చేస్తుంటే నేను వాడిని హీరోని చేశా. ఎందుకంత బ‌లుపు వాడికి.

వాడి ఎదురుగా కూడా ఇలానే మాట్లాడ‌తా అంటూ గోపించ‌ద్‌పై ఇన్‌డైరెక్ట్‌గా దారుణ‌మైన కామెంట్స్ చేశాడు ర‌వి కుమార్. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి వాళ్ళు మాత్రమే చాలా జెన్యూన్ హీరోలు. వాళ్లే రియ‌ల్ హీరోలు. మిగ‌తావారంద‌రు కూడా వాడిలానే ఉంటార‌ని చెప్పుకొచ్చాడు

Exit mobile version