Revanth Reddy Tribute Damodar Reddy | మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు కుటుంబసభ్యులను పరామర్శించారు.

హైదరాబాద్, అక్టోబర్ 03(విధాత): మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. కొడంగల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి మృతిపట్లు సంతాపం వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, కాంగ్రెస్ నేత డా. రోహిన్ రెడ్డి ఉన్నారు.