ఈ ఎంపీలు పాతకొత్తల స మ్మిళితం ..ఎనిమిది మందికి తొలిసారి ఛాన్సు.. తొమ్మిది మంది పాతవారు ఎన్నిక

రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో సగం స్థానాల్లో కాంగ్రెస్, సగం స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి గెలుపొందారు. ఇందులో సగం మంది ఎంపీలు పాతవారు, సగం మంది కొత్తవారు గెలుపొందారు. రాష్ట్ర ప్రజలు సమపాల్లలో గెలిపించారు. తొమ్మిది మంది అనుభవజ్ఞులతోపాటు ఎనిమిది మంది తొలిసారి లోక్ సభలో అడుగుపెడుతున్నవారున్నారు.

ఈ ఎంపీలు పాతకొత్తల స మ్మిళితం ..ఎనిమిది మందికి తొలిసారి ఛాన్సు.. తొమ్మిది మంది పాతవారు ఎన్నిక

విధాత ప్రత్యేక ప్రతినిధి:

రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో సగం స్థానాల్లో కాంగ్రెస్, సగం స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి గెలుపొందారు. ఇందులో సగం మంది ఎంపీలు పాతవారు, సగం మంది కొత్తవారు గెలుపొందారు. రాష్ట్ర ప్రజలు సమపాల్లలో గెలిపించారు. తొమ్మిది మంది అనుభవజ్ఞులతోపాటు ఎనిమిది మంది తొలిసారి లోక్ సభలో అడుగుపెడుతున్నవారున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సురేష్ షేట్కర్, మల్లు రవి,బలరాం నాయక్, బీజేపీ నుంచి గెలిచిన గోడం నగేష్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.కిషన్ రెడ్డి, ఎంఐఎం నుంచి గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ గతంలో లోక్ సభ సభ్యులుగా గెలిచిన అనుభవం ఉంది.

తొలిసారి లోక్ సభలో అడుగుపెడుతున్న వారిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గడ్డం వంశీకృష్ణ, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, రామ సహాయం రఘురాం రెడ్డి బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డికె అరుణ ఉన్నారు. ఎంపీలుగా గెలిచిన వారిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు. కానీ, ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా తొలిసారి ఎంపీగా పోటీచేసి గెలిచిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వంశీకృష్ణ, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, రామసహాయం రఘురాం రెడ్డిలున్నారు. కాంగ్రెస్ పార్టీ వీరికి అవకాశం ఇవ్వగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెడుతున్నారు.

!!!!