Site icon vidhaatha

GHMC | 3,508 మందికి.. మైనార్టీ బంధు చెక్కుల పంపిణీ

GHMC |

విధాత: జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజవర్గాలకు చెందిన 3,508 మంది మైనార్టీ పేదలకు రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ ద్వారా లక్ష రూపాయల ఆర్ధిక సహాయ చెక్కులను నేడు శనివారం లాల్‌ బహదూర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు.

ఉదయం 10గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని లబ్ధిదారులు ఆధార్ కార్డు, లక్ష సహాయ మంజూరీ పత్రం, పాస్ పోటోతో హాజరు కావాలని అధికారులు తెలిపారు. చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవుతారని తెలిపారు.

Exit mobile version