Sreeleela | కేజీఎఫ్ రాఖీబాయ్ యశ్‌కి.. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల మరదలవుతుందా..? ఎలాగో తెలుసా..?
Sreeleela | టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీశీల. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో జోరుమీదున్నది. ప్రస్తుతం దాదాపు ఏడు ఎనిమిది ప్రాజెక్టులు శ్రీలీల చేతిలో ఉన్నాయి. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’తో పాటు భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద తదితర చిత్రాల్లో నటిస్తున్నది. అయితే, కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో ‘రాఖీబాయ్’గా గుర్తింపు పొందిన నటుడు యశ్. అయితే, యశ్‌కు యంగ్ బ్యూటీ శ్రీలీల వరుసకు మరదలు అవుతుంది. మీరు విన్నది నిజమే. యశ్, శ్రీలీల […]

Sreeleela | టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీశీల. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో జోరుమీదున్నది. ప్రస్తుతం దాదాపు ఏడు ఎనిమిది ప్రాజెక్టులు శ్రీలీల చేతిలో ఉన్నాయి. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’తో పాటు భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద తదితర చిత్రాల్లో నటిస్తున్నది. అయితే, కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో ‘రాఖీబాయ్’గా గుర్తింపు పొందిన నటుడు యశ్. అయితే, యశ్‌కు యంగ్ బ్యూటీ శ్రీలీల వరుసకు మరదలు అవుతుంది. మీరు విన్నది నిజమే.
యశ్, శ్రీలీల బంధువులు కారు. కానీ, రెండు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నది. యశ్ సహనటి రాధికా పండిట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యశ్ దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. అయితే, రాధికకు డెలివరీ చేసింది శ్రీశీల తల్లి స్వర్ణలత. స్వర్ణలత బెంగళూరులో పేరుమోసిన గైనకాలజిస్ట్. రాధికకు రెండుసార్లు ఆమెనే డెలివరీ చేశారు. ఈ క్రమంలో యశ్, శ్రీలీల కుటుంబాలు దగ్గరయ్యాయి. ఆ సాన్నిహిత్యంతోనే శ్రీలీల రాధికను అక్కా అని, యశ్‌ను బావ అని పిలుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో శ్రీలీల సైతం స్వయంగా తెలిపింది. ఇలా యశ్‌కు శ్రీలీల మరదలు అయ్యిందన్నమాట..!