Uttar Pradesh | నాలుక‌కు ఆప‌రేష‌న్‌కు వెళ్తే.. పురుషాంగానికి సున్తీ చేసేశారు..

Uttar Pradesh | ఓ అబ్బాయి నాలుక కొంచెం మందంగా ఉండ‌టంతో మాట్లాడ‌డానికి కాస్త ఇబ్బంది ప‌డుతున్నాడు. దీంతో ఆ అబ్బాయిని తీసుకొని ఆస్ప‌త్రికి వెళ్లారు త‌ల్లిదండ్రులు. నాలుక‌కు ఆప‌రేష‌న్ చేయాల‌ని కోర‌గా, అది చేయ‌కుండా పురుషాంగానికి సున్తీ చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌రేలీలోని ఠాణా బారాదరి సంజయ్ నగర్‌లో నివాసముంటున్న హరిమోహన్‌ యాదవ్‌కు చెందిన రెండున్నరేండ్ల‌ కుమారుడు సామ్రాట్‌ మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే అత‌ని నాలుక మందంగా ఉండ‌టంతో.. […]

Uttar Pradesh | నాలుక‌కు ఆప‌రేష‌న్‌కు వెళ్తే.. పురుషాంగానికి సున్తీ చేసేశారు..

Uttar Pradesh | ఓ అబ్బాయి నాలుక కొంచెం మందంగా ఉండ‌టంతో మాట్లాడ‌డానికి కాస్త ఇబ్బంది ప‌డుతున్నాడు. దీంతో ఆ అబ్బాయిని తీసుకొని ఆస్ప‌త్రికి వెళ్లారు త‌ల్లిదండ్రులు. నాలుక‌కు ఆప‌రేష‌న్ చేయాల‌ని కోర‌గా, అది చేయ‌కుండా పురుషాంగానికి సున్తీ చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌రేలీలోని ఠాణా బారాదరి సంజయ్ నగర్‌లో నివాసముంటున్న హరిమోహన్‌ యాదవ్‌కు చెందిన రెండున్నరేండ్ల‌ కుమారుడు సామ్రాట్‌ మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే అత‌ని నాలుక మందంగా ఉండ‌టంతో.. మాట్లాడుతూ త‌డ‌బ‌డేవాడు. దీంతో అత‌న్ని స్థానికంగా ఉన్న ఎం ఖాన్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు.

త‌మ కుమారుడికి మాట‌లు స‌రిగా రావ‌డం లేద‌ని, నాలుక‌కు స‌ర్జ‌రీ చేయాల‌ని వైద్యుడు జావేద్ ఖాన్‌ను కోరారు. అయితే నాలుక‌కు స‌ర్జ‌రీ చేయ‌కుండా, ఆ బాలుడి పురుషాంగానికి సున్తీ చేశారు. ఈ విష‌యం బాలుడి త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో.. ఆస్ప‌త్రి యాజ‌మాన్యంతో గొడ‌వ‌పడి, పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీసులు వివ‌ర‌ణ కోర‌గా.. అయితే బాలుడు మూత్ర విసర్జనకు కూడా ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు అత‌ని త‌ల్లిదండ్రులు త‌న‌కు చెప్పార‌ని డాక్ట‌ర్ జావేద్ ఖాన్ తెలిపాడు. ఆ ఆప‌రేన్ వివ‌రాలు అడిగార‌ని, ఆ మ‌రుస‌టి రోజే సున్తీ చేసిన‌ట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్పీరాహుల్ భాటి మాట్లాడుతూ..ఈ ఘటనకు సంబంధించి విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.