కుక్కను క్రూరంగా హింసించిన డాక్టర్.. వీడియో వైరల్
విధాత: అతను పేరుకే డాక్టర్.. కానీ ఓ కుక్క పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆ మూగ జీవిని తన కారుకు కట్టుకుని రోడ్డుపై అతి వేగంతో వాహనాన్ని పోనిచ్చాడు. ఈ క్రూరమైన చర్యను ఓ వాహనదారుడు తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. డాక్టర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన డాక్టర్ రాజ్‌నీష్ గ్వాలా అనే వ్యక్తి వృత్తిరీత్యా వైద్యుడు. అయితే తన ఇంటికి సమీపంలో ఉన్న వీధి కుక్కను […]

విధాత: అతను పేరుకే డాక్టర్.. కానీ ఓ కుక్క పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆ మూగ జీవిని తన కారుకు కట్టుకుని రోడ్డుపై అతి వేగంతో వాహనాన్ని పోనిచ్చాడు. ఈ క్రూరమైన చర్యను ఓ వాహనదారుడు తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. డాక్టర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన డాక్టర్ రాజ్‌నీష్ గ్వాలా అనే వ్యక్తి వృత్తిరీత్యా వైద్యుడు. అయితే తన ఇంటికి సమీపంలో ఉన్న వీధి కుక్కను వేరే ప్రాంతంలో వదిలిపెట్టి రావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆదివారం రోజు ఆ కుక్కను తన కారుకు తాడుతో కట్టేశాడు. ఇక కారును రోడ్డుపై వేగంగా తీసుకెళ్లాడు. దీంతో కుక్క కాళ్లకు గాయాలయ్యాయి.
ఈ ఘటనను ఓ వాహనదారుడు తన ఫోన్‌లో చిత్రీకరించి వైరల్ చేశాడు. డాక్టర్ తీరుపై ఓ స్వచ్ఛంద సంస్థ తీవ్రంగా స్పందించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజ్‌నీష్ గ్వాలాపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని లైసెన్స్ రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.