Work From Home | వ‌ర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా.. మిమ్మ‌ల్ని సంస్థ ఇలా కూడా గ‌మ‌నించొచ్చు

Work From Home | కీ స్ట్రోక్ టెక్నాల‌జీ ద్వారా యువ‌తిని ఉద్యోగం నుంచి తొల‌గించిన యాజ‌మాన్యం చాలా మంది వ‌ర్క్ ఫ్రం హోం (Work From Home) చేస్తూ.. కాస్త అటూ ఇటూగా ప‌ని ముగించినా ఏం దొర‌కం అని అనుకుంటారు. కానీ సంస్థ మ‌న ప‌ని తీరును ఎక్క‌డి నుంచైనా గ‌మ‌నిస్తుంద‌ని చెప్ప‌డానికి ఆస్ట్రేలియా (Australia) లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న నిద‌ర్శ‌న‌గా నిలిచింది. ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్ (ఐఏజీ)లో సుజీ చియ్‌కో 18 […]

  • By: krs    latest    Aug 10, 2023 12:36 PM IST
Work From Home | వ‌ర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా.. మిమ్మ‌ల్ని సంస్థ ఇలా కూడా గ‌మ‌నించొచ్చు

Work From Home |

కీ స్ట్రోక్ టెక్నాల‌జీ ద్వారా యువ‌తిని ఉద్యోగం నుంచి తొల‌గించిన యాజ‌మాన్యం

చాలా మంది వ‌ర్క్ ఫ్రం హోం (Work From Home) చేస్తూ.. కాస్త అటూ ఇటూగా ప‌ని ముగించినా ఏం దొర‌కం అని అనుకుంటారు. కానీ సంస్థ మ‌న ప‌ని తీరును ఎక్క‌డి నుంచైనా గ‌మ‌నిస్తుంద‌ని చెప్ప‌డానికి ఆస్ట్రేలియా (Australia) లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న నిద‌ర్శ‌న‌గా నిలిచింది. ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్ (ఐఏజీ)లో సుజీ చియ్‌కో 18 ఏళ్లుగా ప‌ని చేస్తున్నారు.

ప్ర‌స్తుతం కొన్నేళ్లుగా ఆమె రిమోట్ వ‌ర్కింగ్ విధానంలో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆమె ప‌నితీరుపై అసంతృప్తిగా ఉన్న సంస్థ యాజ‌మాన్యం కొన్ని రోజుల పాటు కీ స్ట్రోక్ టెక్నాల‌జీ ద్వారా సుజీపై నిఘా పెట్టింది. అందులో గ‌మ‌నించిన వివ‌రాల‌ను చూపిస్తూ.. మీ ప‌ని తీరు బాగోలేద‌ని పేర్కొంటూ ఉద్యోగం నుంచి తొల‌గించింది.

దీనిపై సుజీ ఆస్ట్రేలియా ఫెయిర్ వర్క్ క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించిన‌ప్ప‌టికీ ఊర‌ట ల‌భించ‌లేదు. ఈ తొల‌గింపు చ‌ట్ట‌బ‌ద్ధంగా, న్యాయ‌బ‌ద్ధంగానూ ఉంద‌ని త‌న తీర్పులో పేర్కొంది. త‌న జాబ్ ఛార్ట్ ప్ర‌కారం.. ఇన్సూరెన్స్ ప‌త్రాలు రూపొందించ‌డం, రెగ్యులేట‌రీ గ‌డువుల‌ను స‌మీక్షించ‌డం మొద‌లైన విధుల‌ను సుజీ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో పూర్తిగా విఫ‌లం కావ‌డంతో ఆమెను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఉద్యోగం నుంచి తొల‌గించారు.

ఆమె స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఐఏజీకి ఒక సారి భారీ జ‌రిమానా కూడా ప‌డింది. గ‌తేడాది న‌వంబరు లోనే ఆమెను తన ప‌ని తీరుపై హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ మార్పు రాలేద‌ని సంస్థ ఉన్న‌తాధికారి ఒక‌రు వ్యాఖ్యా నించారు. కీ స్ట్రోక్ టెక్నాల‌జీ ద్వారా ఆవిడ ఎంత సేపు సిస్టంలో ప‌నిచేస్తున్నార‌నే అంశాన్ని ట్రాక్ చేశామ‌న్నారు.

ఇలా 49 రోజుల పాటు సేక‌రించిన స‌మాచారాన్ని విశ్లేషించి ఉద్యోగం లోంచి తొల‌గించామ‌ని తెలిపారు. ఈ 49 రోజుల్లో ఆవిడ 47 రోజులు ఆల‌స్యంగా లాగిన్ అయ్యారు. 29 రోజులు త్వ‌ర‌గా లాగ్ అవుట్ అయ్యారు. నాలుగు రోజులైతే క‌నీసం ఏ పనీ చేయ‌లేదు అని పేర్కొన్నారు.