Donald Trump | ఎన్నిక‌ల అక్ర‌మాల కేసులో ట్రంపు దోషి

Donald Trump | విధాత: అమెరికాలోని జార్జియా (Georgia)లో 2020 ఎన్నిక‌ల్లో డోనాల్డు ట్రంపు (Donald Trump) అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఫుల్‌ట‌న్ కౌంటీ గ్రాండు జ్యూరీ విచార‌ణ‌కు స్వీక‌రించింది. మాజీ అధ్య‌క్షుడు ట్రంపు కేసు విచార‌ణ‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేశారు. ఈ ఆదేశాలు దేశ రాజ‌కీయాల్లో గొప్ప మ‌లుపు కానున్నాయి. రిప‌బ్లిక్ పార్టీ నుంచి తిరిగి అధ్య‌క్ష‌ప‌ద‌వికి పోటీ చేయాల‌ని ఆశిస్తున్న ట్రంపున‌కు ఈ కేసు విచార‌ణ‌ శ‌రాఘాతం కానున్న‌ది. జార్జియాలో త‌న ఓట‌మిని అడ్డుకోవ‌డానికి […]

  • By: Somu    latest    Aug 15, 2023 10:55 AM IST
Donald Trump | ఎన్నిక‌ల అక్ర‌మాల కేసులో ట్రంపు దోషి

Donald Trump | విధాత: అమెరికాలోని జార్జియా (Georgia)లో 2020 ఎన్నిక‌ల్లో డోనాల్డు ట్రంపు (Donald Trump) అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఫుల్‌ట‌న్ కౌంటీ గ్రాండు జ్యూరీ విచార‌ణ‌కు స్వీక‌రించింది. మాజీ అధ్య‌క్షుడు ట్రంపు కేసు విచార‌ణ‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేశారు. ఈ ఆదేశాలు దేశ రాజ‌కీయాల్లో గొప్ప మ‌లుపు కానున్నాయి. రిప‌బ్లిక్ పార్టీ నుంచి తిరిగి అధ్య‌క్ష‌ప‌ద‌వికి పోటీ చేయాల‌ని ఆశిస్తున్న ట్రంపున‌కు ఈ కేసు విచార‌ణ‌ శ‌రాఘాతం కానున్న‌ది.

జార్జియాలో త‌న ఓట‌మిని అడ్డుకోవ‌డానికి ట్రంపు చాలా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు న్యాయ‌మూర్తుల మండ‌లి భావించింది. వ‌చ్చే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తిరిగి పోటీ చేయాల‌నుకుంటున్న ట్రంపుపై ఇది నాలుగ‌వ కేసు. ట్రంపుతోపాటు మ‌రో 18 మంది ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను త‌ప్పుదారి ప‌ట్టించ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని 41 ఆరోప‌ణ‌ల‌తో కూడిన చార్జిషీటును ఫుల్‌ట‌న్ కౌంటీ గ్రాండు జ్యూరీ సోమ‌వారం విచార‌ణ‌కు స్వీక‌రించింది.

కాగా.. స‌హ‌కుట్ర‌దారులు ఉద్దేశ‌పూర్వ‌కంగా, తెలిసి తెలిసి, చ‌ట్ట‌విరుద్ధంగా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ట్రంపున‌కు అనుకూలంగా మార్చ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని జ్యూరీ భావించింది. దోషులుగా నిర్ధ‌రించ‌బ‌డిన వారంతా ఆగ‌స్టు 25 మ‌ధ్యాహ్నం క‌ల్లా స్వ‌చ్ఛందంగా విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పుల్‌ట‌న్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫానీ విల్లిస్ వెల్ల‌డించారు. వ‌చ్చే ఆరు మాసాల్లో ఈ కేసు తుది విచార‌ణ జ‌రుగుతుంద‌ని విల్లిస్ తెలిపారు.