Trump UFO files release| ఏలియన్స్ సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్‌ షాకింగ్ ప్రకటన

గ్రహంతరవాసుల(ఏలియన్స్ )కు చెందిన సమాచారాన్ని బహిర్గతం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతర వాసులు, యూఎఫ్‌ఓలకు సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని పెంటగాన్‌, ఇతర ప్రభుత్వ సంస్థలను ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | సైన్స్​ – టెక్నాలజీ | Feb 20, 2026, 12:42 pm IST
Read Time: 4 mins
Trump UFO files release| ఏలియన్స్ సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్‌ షాకింగ్ ప్రకటన

Trump says he will order the release of Pentagon files on aliens and UFOs

విధాత సైన్స్​ డెస్క్​:

గ్రహంతరవాసుల(ఏలియన్స్ )కు చెందిన సమాచారాన్ని బహిర్గతం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతర వాసులు, యూఎఫ్‌ఓలకు సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని పెంటగాన్‌, ఇతర ప్రభుత్వ సంస్థలను ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ఈ విషయమంటే ప్రపంచానికి ఎంతో ఆసక్తి : ట్రంప్​

ప్రపంచానికి గ్రహంతరవాసుల సమాచారం విపరీత ఆసక్తి కలిగిన అంశమని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో అమెరికా వద్ద గ్రహంతర వాసులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉందన్న అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.ఈ విశాల విశ్వంలో భూ గ్రహంలో మానవుల మాదిరిగానే..ఇతర గ్రహాల్లో ఎక్కడో అక్కడ గ్రహంతర వాసులు ఉండవచ్చన్న చర్చ తరచూ ఆసక్తి రేపుతుంది. అలాగే దశాబ్దం క్రితం అమెరికా ఎయిర్ ఫోర్స్ రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్‌లలో మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై అసాధారణ జీవులు, ఎగిరే వస్తువులు(యూఎఫ్ వోలు) కనిపించాయని నివేదించాయి. ఏలియన్స్‌ను అమెరికా మిలటరీ రహస్య ప్రాంతం ఏరియా 51లో నిర్భంధించారన్న కథనాలు సైతం తరుచూ వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎలియన్స్ కు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇటీవల మాజీ అధ్యక్షుడు ఒబామా ఓ ఇంటర్య్వూలో.. ఏలియన్స్‌ ఉనికి నిజమని, విశ్వంలోని ఏదో ఒక గ్రహంపై గ్రహాంతర వాసులు ఉండే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. అయితే తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఏలియన్స్ కు సంబంధించి అమెరికా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నట్లుగా తనకు కనిపించలేదని ఒబామా అన్నారు. ఏలియన్స్ పై ఒబామా చేసిన వ్యాఖ్యల క్రమంలో ట్రంప్ తాజా ప్రకటన చేయడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.