DR. PREETHI | డా.సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

DR. PREETHI, DR SAIF ఖమ్మం జైలు నుంచి వరంగల్‌కు తరలింపు నాలుగు రోజులపాటు విచారణ అదనపు సమాచారంపై ఆశాభావం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డాక్టర్ ప్రీతి (DR. PREETHI) మృతి కేసులో నిందితుడుగా ఉన్న డాక్టర్ సైఫ్ (DR SAIF) ను ఖమ్మం జైల్ నుంచి పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. ఖమ్మం నుంచి సైఫ్‌ను వరంగల్‌కు తీసుకు వచ్చి స్థానిక మట్టేవాడ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈ విచారణలో ప్రీతి మృతికి సంబంధించిన అదనపు […]

  • By: krs    latest    Mar 02, 2023 10:09 AM IST
DR. PREETHI | డా.సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

DR. PREETHI, DR SAIF

  • ఖమ్మం జైలు నుంచి వరంగల్‌కు తరలింపు
  • నాలుగు రోజులపాటు విచారణ
  • అదనపు సమాచారంపై ఆశాభావం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డాక్టర్ ప్రీతి (DR. PREETHI) మృతి కేసులో నిందితుడుగా ఉన్న డాక్టర్ సైఫ్ (DR SAIF) ను ఖమ్మం జైల్ నుంచి పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. ఖమ్మం నుంచి సైఫ్‌ను వరంగల్‌కు తీసుకు వచ్చి స్థానిక మట్టేవాడ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.

ఈ విచారణలో ప్రీతి మృతికి సంబంధించిన అదనపు సమాచారం ఆధారాలు ఏమైనా లభ్యమవుతాయోననే ఆసక్తి నెలకొంది. పోలీసులు ఆ దిశగా తమ ప్రయత్నం తీవ్రం చేశారు. ఇప్పటికే ర్యాగింగ్ కేసులో సైఫ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

డాక్టర్ సైఫ్‌కు 4 రోజుల పోలీస్ కస్టడీ

డాక్ట‌ర్ ప్రీతి ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన డాక్టర్ ఎంఏ సైఫ్‌ (DR SAIF) కు నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర బుధవారం ఆదేశాలిచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం సైఫ్ ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి.

పోలీసుల అభ్యర్థునతో ఏకీభవించిన జడ్జి గురువారం నుంచి ఆదివారం వరకు సైఫ్‌ (DR SAIF)ను కస్ట‌డీకి అనుమతిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ నాలుగు రోజుల సైఫ్ కస్టడీతో ప్రీతి (DR. PREETHI) మృతి కేసులో కీలక సాక్షాలు దొరికే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కాగా సైఫ్‌ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.