Hema | డ్రగ్స్ ఆరోపణలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన నటి హేమ.. కారణం వారే..!
Hema |టాలీవుడ్ నటి హేమ తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల వ్యవహారంపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలను వెల్లడించారు. ఇన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరుతో కొనసాగుతున్న తనను కావాలనే కొందరు వ్యక్తులు ఇలాంటి కేసులో ఇరికించారని హేమ ఆరోపించారు.
Hema |టాలీవుడ్ నటి హేమ తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల వ్యవహారంపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలను వెల్లడించారు. ఇన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరుతో కొనసాగుతున్న తనను కావాలనే కొందరు వ్యక్తులు ఇలాంటి కేసులో ఇరికించారని హేమ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పలు యూట్యూబ్ ఛానెళ్లు తనను ట్రోల్ చేశాయని, అయితే అది నిజమైన ప్రేక్షకులు చేసింది కాదని ఆమె స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఫేక్ ఐడీలతో తనపై తప్పుడు ప్రచారం చేశారని, వారిని తాను స్వయంగా ఎంక్వైరీ ద్వారా గుర్తించానని తెలిపారు.
డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్న వార్త మొదటిసారి వెలుగులోకి వచ్చిన వెంటనే తాను ఇంట్లోనే మొబైల్‌తో ఒక వీడియో షూట్ చేసి విడుదల చేశానని హేమ వెల్లడించారు. “ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. టెస్టులు చేయించండి. హెయిర్‌లో ఏడాది పాటు డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయి” అని ఆ వీడియోలో తాను చెప్పినట్లు వివరించారు. ఆ తర్వాత పోలీసులు తనకు అధికారికంగా టెస్టులు చేయించారని, తన హెయిర్, నెయిల్స్ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారని తెలిపారు. వాటిలో అన్ని నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయని హేమ చెప్పారు. అంతకుముందే తాను స్వయంగా టెస్టులు చేయించుకుని యూట్యూబ్‌లో పెట్టానని, “నా టెస్టులు నమ్మొద్దు, పోలీసుల టెస్టులు కూడా నమ్మొద్దు. మీరే వచ్చి నాకు టెస్టులు చేయించండి, నిజం తెలిసిపోతుంది” అని సవాల్ విసిరినట్లు చెప్పారు.
తనపై గతంలో కూడా తాను లేని అంశాల్లో పేరు ప్రస్తావిస్తూ తప్పుడు వార్తలు రాశారని హేమ ఆరోపించారు. ఒక అసిస్టెంట్ ఫోన్ చేసి అడిగినప్పుడు, తన శరీరంలో డ్రగ్స్ ఉంటే కాళ్లు పట్టుకుంటానని, లేదంటే తనపై దుష్ప్రచారం చేసినవారు ఏం చేస్తారో ఆలోచించుకోవాలని హెచ్చరించానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మొత్తం 300 కాల్ రికార్డులు, స్క్రీన్ రికార్డులు, వాయిస్ రికార్డులు తన వద్ద ఉన్నాయని, అవసరమైతే వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని హేమ స్పష్టం చేశారు. “వాళ్లు అన్నీ కరెక్ట్‌గా చేయకపోతే నేను కోర్టులో చూసుకుంటాను” అని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే ఈ కేసులో గెలుస్తానన్న పూర్తి నమ్మకం ఉందని హేమ ధీమా వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram