రాడిసన్ హోటల్ పై పోలీసుల దాడి డ్రగ్స్ పట్టివేత.. నిందితుల్లో మాజీ సీఎం మనవడు

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ పై పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. సీపీ అవినాష్ మహంతి తెలిపిన వివరాల మేరకు రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్వోటి పోలీసులు సెర్చ్ చేశారన్నారు

  • By: Somu    latest    Feb 26, 2024 11:23 AM IST
రాడిసన్ హోటల్ పై పోలీసుల దాడి డ్రగ్స్ పట్టివేత.. నిందితుల్లో మాజీ సీఎం మనవడు

విధాత: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ పై పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. సీపీ అవినాష్ మహంతి తెలిపిన వివరాల మేరకు రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్వోటి పోలీసులు సెర్చ్ చేశారన్నారు .అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారయ్యారన్నారు. రాడిసన్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి వెళ్లి విచారించామన్నారు.


వివేకానంద మంజీరా గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నారని తెలిపారు. వివేకానంద ను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్టు చేశామని, వివేకానందతో పాటు నిర్భయ్, కేదార్ లకు పాజిటివ్ వచ్చిందన్నారు. వివేకానందకు యూరిన్ టెస్ట్ చేయించగా కోకైన్ తీసుకున్నట్లు తేలిందన్నారు. ఈ డ్రగ్ పార్టీలో పదిమంది ఉన్నట్లుగా గుర్తించమన్నారు.


రాడిసన్ హోటల్లో గతంలోనూ డ్రగ్ పార్టీలు జరిగినట్లు గుర్తించామన్నారు సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి వీరందరికీ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వివేకానంద, నిర్భయ్, కేదార్ పై కేసును నమోదు చేశామన్నారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నామని తెలిపారు. వివేకానంద మాజీ సీఎం రోశయ్య కుమారుడు, బిజేపి నేత యోగానంద కుమారుడు.