ప్రణిత్‌రావు కేసు సిట్‌కు బదిలీ.. మాజీ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధం

గత బీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల, అధికారుల ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన కేసులో డీఎస్పీ ప్రణిత్‌రావు కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది

ప్రణిత్‌రావు కేసు సిట్‌కు బదిలీ.. మాజీ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధం

విధాత, హైదరాబాద్ : గత బీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల, అధికారుల ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన కేసులో డీఎస్పీ ప్రణిత్‌రావు కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ప్రణిత్‌రావును మంగళవారం రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. ప్రణిత్‌రావు అరెస్టు కోసం ఆయన నివాసం వద్ద పోలీసులు మూడు రోజులు రెక్కి నిర్వహించి మరి అతడిని అరెస్టు చేశారు. విచారణలో ప్రణిత్‌రావు ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు ఆదేశించిన, సహకరించిన ఎస్‌ఐబీ అధికారుల పేర్లను వెల్లడించారని, దీంతో వారి అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందని తెలుస్తుంది. డిఎస్పీ ప్రణిత్‌రావు కేసును సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులందరిని బయటకు లాగాలని సిట్‌ను ఆదేశించడంతో ఈ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి డిఎస్పీ ప్రణిత్‌రావు ప్రభుత్వం మారగానే ట్యాపింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో కేసుతో ప్రమేమయమున్న అధికారుల అరెస్టు తప్పదని తేలుతుంది.