Eatela | అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. పది మంది మెచ్చే పద్ధతిలో ఉండాలి: ఈటల
Eatela | విధాత: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, భూమిపై వెయ్యి ఏళ్ళు బ్రతకడానికి మనం రాలేదని పదిమంది మెచ్చే పద్ధతిలో ఉండాలని ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని, మమ్ముల్ని అవమానించడ మంటే మా ప్రజలను అవమానించడమేనన్నారు. ఏక పక్ష నిర్ణయాలు మంచివి కాదు, మా హక్కులు, ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గా మీపై ఉందని తెలిపారు. ఇలాంటి చర్యలు ఇకనైనా […]

Eatela |
విధాత: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, భూమిపై వెయ్యి ఏళ్ళు బ్రతకడానికి మనం రాలేదని పదిమంది మెచ్చే పద్ధతిలో ఉండాలని ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని, మమ్ముల్ని అవమానించడ మంటే మా ప్రజలను అవమానించడమేనన్నారు. ఏక పక్ష నిర్ణయాలు మంచివి కాదు, మా హక్కులు, ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గా మీపై ఉందని తెలిపారు. ఇలాంటి చర్యలు ఇకనైనా ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నానని వెల్లడించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల్లో నష్టపోయిన బాదితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. గతంలో ఎకరాకు 10 వేలు ఇస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇప్పుడైనా వెంటనే ఇవ్వాలన్నారు. చెక్ డాంలను ఇంజనీర్లతో పరిశీలన చేయించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణలో ప్రైమరీ విద్య అనాదరణకు గురిఅవుతుందన్నారు. విద్యారంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారిని తొలగించవద్దు. గెస్ట్ లెక్చరర్స్ కి 12 నెలల జీతం ఇవ్వాలి. స్కూల్లో పని చేస్తున్న కంటింజంట్ ఎంప్లాయిస్ కి 8 వేల జీతం ఇవ్వాలి. మెడికల్ కాలేజీలు ఇచ్చారు తప్ప కనీస పరికరాలు ఇవ్వలేదన్నారు. సెకండ్ ANM లకు, ఫస్ట్ ANM ల మాదిరిగా జీతాలు ఇవ్వాలి.
ఆస్ట్రేలియాలో మైనింగ్ చేస్తాం అని చెప్పారు. కానీ 63 వేల కార్మికులు ఉంటే 43 వేలకు తెచ్చారు. 10 వేల మంది ఉన్న ఔట్ సోర్సింగ్ కార్మికులు 30 వేల మందికి పెంచారు. అప్పులు పాలు అయిన సింగరేణికి పూర్వవైభవం సంతరించాలన్నారు. ఆర్టీసీ విలీనం మంచి నిర్ణయం కానీ వారికి రావాల్సిన PRC, PF బకాయిలు అందించాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు. తెలంగాణ 85 శాతం బడుగు, బలహీన వర్గాల రాష్ట్రం. ఐఏఎస్ అధికారులకు కూడా దళితబంధు ఇస్తా అనడం సరికాదు. పేదవారికి మాత్రమే ఇచ్చేలా సరిచేసుకోవాలన్నారు. గిరిజనబంధు కూడా పేదవారికి అందరికీ ఇవ్వాలి. బీసీబందు మాత్రమే కాదు అన్ని కులాల్లో ఉన్న పేద వారందరికీ బంధు ఇవ్వాలి.
దళితులకు ఒక సారి మాదిగ, ఒక సారి మాల అని కాకుండా రెండు మంత్రి పదవులు ఇవ్వాలి. ఉద్యోగులకు PRC వెంటనే ప్రకటించాలన్నారు. DSC 2008లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ ఉద్యోగం ఇవ్వాలన్నారు. తెలంగాణ వచ్చాక ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇవ్వాలి, ఎవరి జాగాలో వారు ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈటల తెలిపారు.