Egg | కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. సామాన్యుడు విలవిల
Egg | ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు మాంసాహారంపై దృష్టి సారిస్తారు. చేపలు, చికెన్, మటన్ ఆరగించేందుకు సిద్ధమవుతుంటారు. వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి ఫిష్, చికెన్ లేదా మటన్ తెచ్చుకుని తింటుంటారు. ఇక వాటికి కూడా డబ్బు పెట్టలేని సామాన్యులు కోడి గుడ్ల వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు కోడి గుడ్డును కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యుడు కూడా కోడి గుడ్డును […]

Egg | ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు మాంసాహారంపై దృష్టి సారిస్తారు. చేపలు, చికెన్, మటన్ ఆరగించేందుకు సిద్ధమవుతుంటారు. వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి ఫిష్, చికెన్ లేదా మటన్ తెచ్చుకుని తింటుంటారు. ఇక వాటికి కూడా డబ్బు పెట్టలేని సామాన్యులు కోడి గుడ్ల వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు కోడి గుడ్డును కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యుడు కూడా కోడి గుడ్డును కొందామంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో డజన్(12) కోడి గుడ్ల ధర రూ. 80గా ఉంది. ఒక్కో గుడ్డు అయితే రూ. 7కు విక్రయిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి డజన్ కోడి గుడ్ల ధర రూ. 65 నుంచి రూ. 70 మధ్య ఉంది. కానీ ఈ పది రోజుల్లోనే డజన్ గుడ్ల ధర రూ. 80కి చేరడంతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు.
అయితే కోడి గుడ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. వినియోగంతో పాటు దానా ధరలు పెరగడమే అని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావార్ పేర్కొన్నారు. 2020లో గుడ్లు పెట్టే కోళ్లకు వేసే దానా ధర రూ.14 నుంచి 16 ఉండగా.. నేడు రూ.28 నుంచి 30కి పెరిగిందన్నారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గట్టు కోడి గుడ్ల ఉత్పత్తి లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నెక్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ 70 లక్షల గుడ్ల వినియోగం ఉంటుందని సంజీవ్ చెప్పారు.