Eiffel Tower | ఈఫిల్ టవర్‌ను బాంబులతో పేల్చేస్తాం.. భద్రతా సిబ్బంది అప్రమత్తం
Eiffel Tower | ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌ను పేల్చేస్తామని గుర్తు తెలియని దుండగులు హెచ్చరించారు. ఈఫిల్ టవర్‌ను కూల్చేసేందుకు బాంబులు అమర్చామంటూ దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఈఫిల్ టవర్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా పర్యాటకులను అక్కడ్నుంచి ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. బాంబు బెదిరింపు కాల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈఫిల్ […]
Eiffel Tower |
ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌ను పేల్చేస్తామని గుర్తు తెలియని దుండగులు హెచ్చరించారు. ఈఫిల్ టవర్‌ను కూల్చేసేందుకు బాంబులు అమర్చామంటూ దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది.
ఈఫిల్ టవర్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా పర్యాటకులను అక్కడ్నుంచి ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. బాంబు బెదిరింపు కాల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈఫిల్ టవర్ నిర్మాణ పనులను 1887, జనవరిలో ప్రారంభించారు. రెండేండ్ల పాటు అంటే 1889, మార్చి నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గతేడాది ఈఫిల్ టవర్‌ను 6.2 మిలియన్ల మంది వీక్షించారు. ఈ అద్భుత నిర్మాణాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో ఫ్రాన్స్‌కు పర్యాటకులు వెళ్తుంటారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram