Bomb Threat | ఢిల్లీలో 300 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం 300 స్కూళ్లతో పాటు పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ హోక్స్ కాల్స్ అని ఢిల్లీ పోలీసులు తేల్చారు. బాంబు బెదిరింపులన్నీ Terrorizers111 అనే గ్రూపు నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.
Bomb Threat | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం 300 స్కూళ్లతో పాటు పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ హోక్స్ కాల్స్ అని ఢిల్లీ పోలీసులు తేల్చారు. బాంబు బెదిరింపులన్నీ Terrorizers111 అనే గ్రూపు నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ బెదిరింపు మేసేజ్‌లన్నీ ఆదివారం ఉదయం 6.08 గంటలకు వచ్చాయని తెలిపారు. మొత్తం 300 మెయిల్స్ వచ్చాయని, అందులో స్కూల్స్, పలు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్లు హెచ్చరించారు. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆయా స్కూళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కూడా బాంబు బెదిరింపు రావడంతో అక్కడ కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆయా పాఠశాలలతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, ఎలాంటి బాంబులు లేవని తేల్చారు. దీంతో స్కూల్స్ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నారు.
నేను టెర్రరిస్టు గ్రూపునకు లీడర్‌ను. స్కూళ్లు, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో బాంబులు పెట్టాను. 24 గంటల్లో ఆ ప్రాంతాలన్నీ రక్తపు మడుగులుగా మారుతాయి. ద్వేషంతోనే ఈ ఘటనకు పాల్పడుతున్నట్టు ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవలి కాలంలో కూడా పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. వారం క్రితం డీపీఎస్ ద్వారకా, కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సెప్టెంబర్ 9వ తేదీన యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు బాంబు బెదిరింపు రాగా, ఇవన్నీ హోక్స్ కాల్స్ అని పోలీసులు తేల్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram