Indigo Flight Diverted To Chennai Over Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు…చైన్నెలో ల్యాండింగ్
ముంబై-ఫుకెట్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీలు జరిపారు.

న్యూఢిల్లీ : ముంబై నుంచి థాయ్‌లాండ్ లోని పుకెట్ దీవులకు వెళ్తున్న ఇండిగో( 6ఈ 1089) విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి పుకెట్ కు బయలుదేరిన విమానానికి గాలిలో ఉండగానే బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ అధికారులకు సమాచారం అందించాడు. ముందు జాగ్రత్తగా విమానాన్ని చెన్నై విమానాశ్రయానికి దారి మళ్లించాడు.
చెన్నై విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానంలో తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపులు ఉత్తవేనని నిర్ధారించుకున్నాక తిరిగి విమానం తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు కొన్ని గంటల పాటు అసలేం జరుగుతుందోనంటూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.