Bomb Threat To Delhi Taj Palace : ఢిల్లీ తాజ్ ప్యాలెస్‌కు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌తో కలకలం. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి అప్రమత్తమయ్యారు.

Bomb Threat To Delhi Taj Palace : ఢిల్లీ తాజ్ ప్యాలెస్‌కు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో(Delhi) వరుస బాంబు బెదిరింపు ఘటనలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఢిల్లీలోని ప్రముఖ స్టార్ హోటల్ తాజ్ ప్యాలెస్‌కు బాంబు బెదిరింపులు(Bomb threats to Taj Palace) వచ్చాయి. తాజ్ ప్యాలెస్ ప్రపంచ స్థాయి హోటల్ కావడంతో బాంబు బెదిరింపుల పట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబులు పెట్టి ప్యాలెస్‌ని కూల్చేస్తామంటూ.. బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. వెంటనే ప్యాలెస్‌ను ఖాళీ చేయించి.. తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో ఎలాంటి బాంబులను గుర్తించకపోవడంతో బాంబు బెదిరింపు మెయిల్ అకతాయిల పనిగా పోలీసులు నిర్ధారించుకుని..విచారణ కొనసాగిస్తున్నారు. అంతకుముందు రోజు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుల మెయిల్ రావడం..తనిఖీల్లో బెదిరింపులు వట్టివేనని తేలిపోయాయి.