Viral Video | ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతూ.. కడుపు నింపుకునేందుకు భిక్షాటన.. ఓ వృద్ధురాలి ధీనగాథ ఇది..
Viral Video | ఆమె ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతోంది.. కానీ భిక్షాటన చేస్తోంది. బుక్కెడు బువ్వ.. గుక్కెడు నీళ్ల కోసమే భిక్షాటన చేస్తున్నట్లు ఆ వృద్ధురాలు వివరించింది. భిక్షాటన చేయకపోతే తన కడుపు ఎలా నిండుతుందని ఆమె పడిన ఆవేదన.. అందరి హృదయాలను కదిలించింది. చెన్నై వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధురాలిని కంటెంట్ క్రియేటర్ మహ్మద్ ఆశిక్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆ వృద్ధురాలికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. […]

ఆమె ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతోంది.. కానీ భిక్షాటన చేస్తోంది. బుక్కెడు బువ్వ.. గుక్కెడు నీళ్ల కోసమే భిక్షాటన చేస్తున్నట్లు ఆ వృద్ధురాలు వివరించింది. భిక్షాటన చేయకపోతే తన కడుపు ఎలా నిండుతుందని ఆమె పడిన ఆవేదన.. అందరి హృదయాలను కదిలించింది. చెన్నై వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధురాలిని కంటెంట్ క్రియేటర్ మహ్మద్ ఆశిక్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆ వృద్ధురాలికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఆ వృద్ధురాలి మాటల్లోనే.. నా పేరు మెర్లిన్(81). నాది మయన్మార్. ఇండియన్‌ను పెళ్లి చేసుకోవడంతో ఇక్కడకు వచ్చాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. ఒంటరిగా జీవిస్తున్నాను. కడుపు నింపుకునేందుకు భిక్షాటన చేస్తున్నాను. మయన్మార్‌లో ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచర్‌గా పని చేశానని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇక కంటెంట్ క్రియేటర్ మహ్మద్ ఆశిక్ ఆ వృద్ధురాలికి బహుమతి ఇచ్చాడు. ఒక శారీ బహుమతిగా అందజేసి ఆ ముఖంలో సంతోషం నింపాడు. చీరను చూసి ఆమె మురిసిపోయారు. ఇక నుంచి భిక్షాటన చేయొద్దని మెర్లిన్‌ను అతను కోరాడు.
ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్తే తానే డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇంకేముంది ఆమె అంగీకరించడంతో.. ఆశిక్ ఇంగ్లీష్ విత్ మెర్లిన్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేజీ క్రియేట్ చేశాడు. మహ్మద్ అశిక్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెర్లిన్ ఇంగ్లీష్ టాకింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
View this post on Instagram