స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది

  • By: Somu    latest    Dec 11, 2023 11:35 AM IST
స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్

విధాత : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 14న కొత్త స్పీకర్ ఎన్నిక జరగనుంది.


కాంగ్రెస్ పార్టీ తరఫున వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ ఇప్పటికే స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇతర పార్టీల నుండి నామినేషన్లు ఎవరు నామినేషన్ దాఖలు పక్షంలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.