దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

విధాత: చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఇంద్రావతి నది సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇన్సాన్స్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
మావోయిస్టు అగ్ర నేతల కోసం ఈ ప్రాంతంలో సమావేశం అయ్యారని పక్కా సమాచారంతో దoతెవాడ , బీజాపూర్ , నారాయణపూర్ జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. సుమారు 500 మందితో కూడిన సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో దంతెవాడ, నారాయణపూర్ బోర్డర్లోని అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. దంతేవాడ ఎస్పీ గౌరవరాయి, ఏ ఎస్ పి బర్మన్లు ఈ ఎన్‌కౌంటర్ ను ధ్రువీకరించారు.