Etv Win OTT Free Content | మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. రెండు రోజులు ఆ ఓటీటీలో సినిమాలన్నీ ఫ్రీగా చూసే ఛాన్స్!
Etv Win OTT Free Content | ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్స్ లో మాత్రమే చూసే అవకాశం ఉంది. కాని ఇప్పుడు చాలా ఓటీటీలు వచ్చాయి. కొత్త కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఓటీటీల మధ్య పోటీ ఎక్కువ కావడంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రేక్షకలని అట్రాక్ట్ చేసేందుకు కొన్ని ఆఫర్స్ కూడా తెస్తున్నాయి. ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసే బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాయి. తాజాగా […]
Etv Win OTT Free Content |
ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్స్ లో మాత్రమే చూసే అవకాశం ఉంది. కాని ఇప్పుడు చాలా ఓటీటీలు వచ్చాయి. కొత్త కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఓటీటీల మధ్య పోటీ ఎక్కువ కావడంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రేక్షకలని అట్రాక్ట్ చేసేందుకు కొన్ని ఆఫర్స్ కూడా తెస్తున్నాయి.
ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసే బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాయి. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు చెందిన ఈటీవీ విన్ రెండు రోజుల పాటు తమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మొత్తం కంటెంట్ ను ఉచితంగా చూసే బంపర్ ఆఫర్ ఇచ్చింది.
వాచ్ పార్టీ పేరుతో ఆఫర్‌ను ప్రకటించిన ఈటీవీ విన్.. ఆగస్టు 26, 27 తేదీల్లో తమ సినిమాలు, షోలన్నీ ఉచితంగా చూడవచ్చంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ‘మీ అందరి కోసం ఎంతో ఉత్సాహవంతమైన అనౌన్స్‌మెంట్. ‘వాచ్ పార్టీ’ పేరుతో ఈటీవీ విన్ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈటీవీ విన్‌లో ఉన్న సినిమాలు, షోలను ఆగస్టు 26, 27 తేదీల్లో మొత్తం రెండు రెండు రోజుల పాటు ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వారాంతంలో మీ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోండి. తమ ప్లాట్ ఫామ్ లోని కంటెంట్ మొత్తాన్ని చూసి ఆనందించండి’ అంటూ ఈటీవీ విన్ తమ ప్రకటనలో తెలియజేసింది.
ఈటీవీ 28వ వార్షికోత్సవం సందర్భంగా ఓటీటీ ఫ్యాన్స్ కోసం ఇలా సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు.ఇందులో ఐదు వందలకుపైగా క్లాసిక్ మూవీస్‌తో పాటు పలు షోలను కూడా ఫ్రీగా చూసే అవకాశం ఉంది. ఇక ఈటీవీ విన్ ఓటీటీలో ఇటీవల అన్నపూర్ణ ఫొటో స్టూడియో మూవీ రిలీజ్ కాగా, దీంతో పాటు కనులు తెరిచినా కనులు మూసినా, పంచతంత్ర కథలుతో పాటు పలు సినిమాలు ఉన్నాయి.
ఇక ఈటీవీకి సంబంధించిన జబర్ధస్థ్, సుమ అడ్డా, క్యాష్ లాంటి షోలను కూడా ఈ ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, సండే రోజు వాటిని చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయండి. సాధారణంగా ఈటీవీ విన్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి 499 రూపాయలుగా ఉండగా, ఈ రెండు రోజులు మాత్రం అన్ని పూర్తి ఉచితం.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram